కెనడాలో ఓజీ.. అసలేం జరుగుతోంది?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 24 Sept 2025 4:45 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నెవ్వర్ బిఫోర్ అనేలా హైప్ క్రియేట్ చేసుకున్న ఓజీ.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది. నేడు ప్రీమియర్స్ కూడా పడనున్నాయి.
ఓవర్సీస్ లో కూడా భారీ రేంజ్ లో సినిమా రిలీజ్ కానుండగా.. అప్పుడే సంబరాలు అంబరాన్నంటాయి. అయితే అమెరికాలో సినిమా డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి పలు పరిణామాలు జరుగుతున్నాయి. కెనడాలో ముందు మేకర్స్ సినిమాను రిలీజ్ చేయడం లేదని చెప్పగా.. ఆ తర్వాత హార్డ్ డ్రైవ్ లు డిస్ట్రిబ్యూటర్లకు అందాయని తెలిపారు.
దీంతో కెనడాలో సినిమా సాఫీగా రిలీజ్ అవ్వనుంది. కానీ అసలు ఏం జరుగుతుందోనని నెటిజన్లు, సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు. కొందరు పలు ప్రశ్నలకు కూడా లేవనెత్తుతున్నారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా మూవీస్ సోషల్ మీడియా హ్యాండిల్ ను ట్యాగ్ చేసి.. వాటికి ఆన్సర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మెగా ఫ్యామిలీ సినిమాలు మాత్రమే కెనడాలో ప్రతిసారీ అడ్డంకులను ఎందుకు ఎదుర్కొంటున్నాయని, అభిమానులను మళ్లీ మళ్లీ బాధ కలుగుతుందని నెటిజన్లు అన్నారు. సరిగా లేని థియేటర్లలో మాత్రమే ఎందుకు ప్రదిర్శితమవుతున్నాయని, పాన్ ఇండియా రిలీజ్ కు న్యాయం చేస్తున్నారని క్వశ్చన్ చేశారు.
ఇతర పెద్ద చిత్రాల మాదిరిగా సినీప్లెక్స్ చైన్ థియేటర్లలో మనం ఎందుకు సరైన విడుదలను పొందడం లేదని అడిగారు. దీంతో డిస్ట్రిబ్యూషన్ హౌస్ ప్రత్యంగిరా మూవీస్ స్పందించింది. సమస్య నిజంగా ప్రారంభించిన సరైన వ్యక్తుల వైపు మీ వేలు చూపండని తెలిపింది. తమను ఎవరూ భయపెట్టలేరని చెప్పింది.
ఎంత ఖర్చయినా సరే, సరైన దాని కోసం మేము నిలబడటానికి, పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. పవన్ సర్ భీమ్లా నాయక్ చిత్రాన్ని అదే వ్యక్తులు ఎలా ఇబ్బంది పెట్టారో, అభిమానులు శాంతియుతంగా చూడకుండా బాధపెట్టారో గుర్తుందని చెప్పింది. తాము ఇక్కడితో ఆపేస్తున్నామని తెలిపింది.
తాము సినిమా ప్రేమికులమని, ప్రత్యంగిరా సినిమాస్ చిత్రాల పట్ల మక్కువతో ప్రారంభమైందని తెలిపింది. సినిమాను ఎంజాయ్ చేయడానికి బదులుగా బ్లాక్ మెయిల్ చేయడం బాధాకరమని పేర్కొంది. కానీ ఏది ఏమైనా, అభిమానులతో తమ బంధం, సినిమా పట్ల నిబద్ధత ఎల్లప్పుడూ ఏ అడ్డంకి రానివ్వవని ముగించింది.
