టాప్ ఓపెనింగ్స్.. RRR కి దగ్గరగా OG
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ కు ముందే ప్రభంజనం సృష్టిస్తుంది. సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
By: M Prashanth | 24 Sept 2025 2:20 PM ISTపవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ కు ముందే ప్రభంజనం సృష్టిస్తుంది. సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇవాళ ప్రీమియర్స్ పడనున్నాయి. అటు ఓవర్సీస్ లోనూ ఇవాళే సినిమా ప్రదర్శన ఉంది. అయితే బుకింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి ఈ సినిమా ఓవర్సీస్ లో రికార్డులు సృష్టిస్తోంది. భారీ స్థాయిలో టికెట్ సేల్స్ జరుగుతున్నాయి.
నెల కిందటే అమెరికా, కెనడా వ్యాప్తంగా ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. పవన్ కళ్యాణ్ మేనియా అక్కడ గట్టిగానే కొనసాగుతోంది. ఎన్నో రోజులన నుంచి వెయిట్ చేయిస్తున్న సినిమా కాబట్టి.. అక్కడి ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని చూస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఇలా టికెట్లు రిలీజ్ అవ్వగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. జెట్ స్పీడ్ లో ఓజీ టికెట్లు సేల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఓజీ కొన్ని గంటల ముందే 2.40 మిలియన్ డాలర్లు వసూల్ చేసింది. 2.5 మిలియన్ డాలర్ల వైపునకు దూసుకుపోతోంది. దీంతో రిలీజ్ కు ముందే అమెరికాలో ఓజీ అరుదైన ఘనతలు సాధించింది. ఇప్పటికే ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 6 సినిమాగా ఘతన సాధించగా,... తాజాగా టాప్ 3లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి గతేడాది వచ్చిన దేవర ఫైనల్ అడ్వాన్స్ సేల్స్ ను దాటేసింది.
దేవర 2.33 మిలియన్ డాలర్లు కొట్టగా... ఓజీ తాజాగా 2.40 మిలియన్ డాలర్లకో అధిగమించి మూడో ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ జాబితాలో రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ టాప్ లో ఉంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా యూఎస్ ఏ ప్రీమియర్స్ లో 2.77 మిలియన్ డాలర్లు కొట్టగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఓజీ ప్రభంజనం కొనసాగుతోంది.
ఇంకొన్ని గంటలు ఇదే హావా ఉంటే.. ఈ లిస్ట్ లో ఓడీ తొలి స్థానానకి చేరుకున్నా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం పవన్ ఓజీ 2.40 మిలియన్ డాలర్లు క్రాస్ చేసింది. సేల్స్ ఇంకా ఆన్ లో ఉన్నాయి. కాబట్టి కల్కి 2.77 మిలియన్ డాలర్లను బీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంచితే మరి ఇటీవల కాలంలో ఓవర్సీస్ యూఎస్ ఏ ప్రీమియర్స్ లో ఫైనల్ సేల్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు ఏంటో చూసేద్దామా?
కల్కి - 2.77 మిలియన్ డాలర్లు
ఆర్ఆర్ఆర్ -2.75 మిలియన్ డాలర్లు
ఓజీ - 2.4 మిలియన్ డాలర్లు (ఇంకా కొన్ని గంటలు ఉన్నాయి)
దేవర - 2.33 మిలియన్ డాలర్లు
పుష్ప 2- 2.29 మిలియన్ డాలర్లు
సలార్ - 1.8 మిలియన్ డాలర్లు
గుంటూరు కారం- 1.06 మిలియన్ డాలర్లు
గేమ్ ఛేంజర్- 658K డాలర్లు
వార్- 562K డాలర్లు
హరిహర వీరమల్లు - 503K డాలర్లు
