పవన్ 'OG'.. ఓవర్సీస్ లో ఆ మార్క్ మిస్ అయిందా?
ముఖ్యంగా ఓవర్సీస్ ప్రీమియర్స్ తో ఓజీ మూవీ కొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి విదితమే.
By: M Prashanth | 29 Sept 2025 4:09 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ డ్రామాగా యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించగా.. సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్ గా విడుదలైంది. ముందు రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ కూడా పడ్డాయి.
ముఖ్యంగా ఓవర్సీస్ ప్రీమియర్స్ తో ఓజీ మూవీ కొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి విదితమే. ప్రీమియర్స్ లోనే 3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 26 కోట్ల రూపాయలు) వసూళ్లు రాబట్టి నెవ్వర్ బిఫోర్ ఫీట్ ను అందుకుంది. దీంతో సినిమా 5 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు.
అది కూడా.. ఫస్ట్ వీకెండ్ కల్లా 5 మిలియన్ డాలర్స్ మార్క్ ను ఓజీ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. ప్రీమియర్ల నుంచే పెద్ద మొత్తంలో రావడంతో.. వీకెండ్ కల్లా 5.5 మిలియన్లకు పైగా ఈజీగా సాధిస్తుందని నిపుణులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు.. ఓజీ మూవీ ఆ మార్క్ ను అందుకోలేకపోయింది. సోమవారం అందుకునేలా కనిపిస్తుంది.
వీకెండ్ కల్లా ఓజీ సినిమా 4.9 మిలియన్ డాలర్స్ ను వసూలు చేసినట్లు తెలుస్తోంది. పవన్ కెరీర్ లో ఇదే బెస్ట్ నెంబర్స్ అయినప్పటికీ.. వీకెండ్ లో 5 మిలియన్ మార్క్ మాత్రం మిస్ అయింది. కానీ డిస్ట్రిబ్యూటర్స్ కు మాత్రం భారీ లాభాలు అందిస్తోంది. ఇప్పటికే అక్కడ సినిమా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని లాభాల బాటలో పయనిస్తోంది.
అయితే ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 25.5 కోట్ల రూపాయల మేరకు అమ్ముడయ్యాయని ఇప్పటికే టాక్ వినిపించింది. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుందని రిలీజ్ కు ముందు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆ మార్క్ ను ఇప్పటికే ఓజీ మూవీ క్రాస్ చేసింది.
ఇక సినిమా విషయానికొస్తే.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య తన కొడుకు కళ్యాణ్ తో కలిసి నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించారు.
