Begin typing your search above and press return to search.

ఇందుకే కదా పవన్ ను నిజమైన ఓజీ అనేది

టాలీవుడ్ లో ప్రేక్షకులు ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో దే కాల్ హిమ్ ఓజీ ఒకటి.

By:  M Prashanth   |   19 Sept 2025 1:58 PM IST
ఇందుకే కదా పవన్ ను నిజమైన ఓజీ అనేది
X

టాలీవుడ్ లో ప్రేక్షకులు ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో దే కాల్ హిమ్ ఓజీ ఒకటి. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా ఓజీ మేనియా కొనసాగుతోంది. ఓవర్సీస్ బుకింగ్స్ లో దూసుకుపోతున్న ఈ సినిమా తాజాగా అరుదైన ఘనత సాధించింది.

ఉత్తర అమెరికాలో ఓజీ ఇప్పటికే ప్రీ సేల్స్ 1.75 డాలర్ల మిలియన్ల మార్క్ దాటింది. ఇందులో ఆశ్చర్యకం అటంటే ఈ 1.75 డాలర్ల మిలియన్ లో 1 మిలియన్ డాలర్లు కేవలం అమెరికాలోని అతిపెద్ద థియేటర్ చైన్‌ లలో ఒకటైన సినిమార్క్ నుంచే వచ్చింది. అయితే ట్రైలర్ విడుదల కాకముందే ఈ ఘనత సాధించడం పవన్ కల్యాణ్ నిజమైన ఓజీ అనే విషయాన్ని మరోసారి నిరూపించింది.

ఇక ఈ చిత్రం అధికారిక ట్రైలర్ ఆదివారం (సెప్టెంబర్ 21)న ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు ప్రొడక్షన్ సంస్థ డీవీవీ ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చింది. సినిమా విడుదలకు ముందు ట్రైలర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మువీటీమ్ బలంగా నమ్ముతుంది. అయితే సినిమాపై ఉన్న హైప్ కు ప్రీమియర్స్ లో మంచి టాక్ బయటకు వస్తే, ఓజీ రికార్డులను ఆపడం ఎవరి వల్లా అవ్వదు.

ఇప్పటికే రిలీజైన పాటలు, వీడియో గ్లింప్స్ కూడా భారీ రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. దీనికి తోడు ఓవర్సీస్ బుకింగ్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ధరల నిర్ణయం ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. టికెట్ ధరలపై స్పష్టత వచ్చిన తర్వాత ఇక్కడ కూడా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.

ఈ సినిమాపై మెగా అభిమానులు ఇప్పటికే ఉత్సాహంతో ఉన్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. ఇమ్రన్ హష్మి విలన్ పాత్ర పోషించారు. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, షామ్, శ్రీయా రెడ్డి తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.