Begin typing your search above and press return to search.

ఓటీటీకి సిద్దమవుతున్న OG: ఛాలెంజ్ ఏమిటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఓజీ (OG)' సినిమా థియేటర్లలోకి వచ్చి అంచనాలను అందుకుని మంచి మాస్ ట్రీట్ ఇచ్చింది.

By:  M Prashanth   |   14 Oct 2025 11:21 AM IST
ఓటీటీకి సిద్దమవుతున్న OG: ఛాలెంజ్ ఏమిటంటే..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఓజీ (OG)' సినిమా థియేటర్లలోకి వచ్చి అంచనాలను అందుకుని మంచి మాస్ ట్రీట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఫోకస్ పెరిగింది. ఈసారి, ఓటీటీ రిలీజ్ అనేది కేవలం అభిమానులకు బిగ్ ట్రీట్ ఇవ్వడం మాత్రమే కాదు, సినిమా కథాబలం ఎమోషనల్ కనెక్ట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

బాక్సాఫీస్ కలెక్షన్స్

కొన్ని సినిమాలు థియేటర్ లో క్లిక్కయితే ఓటీటీలో ఆడవు. మరికొన్ని థియేటర్స్ ఆడకున్నా ఓటీటీలో క్లిక్కయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఓజి ఓటీటీ టాక్ ఎలా ఉంటుందనే ఆసక్తి పెరిగింది. ​సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, వీక్ డేస్ కలెక్షన్ల పరంగా డ్రాప్ చూపించినప్పటికీ, ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. సినిమాకు క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ కనెక్ట్ కాలేదు అనే కామెంట్లు వచ్చినా, కేవలం పవన్ స్టైలిష్ యాక్షన్, సుజీత్ మేకింగ్ ఫ్యాన్స్ ఎలివేషన్స్‌తోనే ఈ చిత్రం సుమారు 290 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే, ఈ సినిమా ₹4 కోట్ల వరకు ప్రాఫిట్ అందుకున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ ఉంది.

​ఓటీటీలో ఎమోషనల్ టెస్ట్

​నిర్మాత డీవీవీ దానయ్య నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే, సేఫ్ గేమ్లో మంచి లాభాలు అందుకున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ముందు ఉన్న అసలు ఛాలెంజ్ ఏంటంటే.. థియేటర్‌లో ఎమోషన్ కనెక్ట్ కాలేదనే కామెంట్‌ను, ఓటీటీలో క్లిక్ అయ్యేలా చేయగలరా? అనేది. థియేటర్‌లో హైప్, మాస్ హిస్టీరియా నడిచింది. కానీ, ఇంట్లో హాయిగా కూర్చుని చూసే ఓటీటీ ఆడియన్స్, సినిమాలోని క్యారెక్టర్ ఆర్క్స్‌ను ఎమోషనల్ డెప్త్‌ను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది అసలైన టెస్ట్.

​దీపావళి తర్వాతే ప్లాన్

​'ఓజీ'కి ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా, ఓటీటీ రిలీజ్ డేట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత 4 నుంచి 8 వారాల గ్యాప్‌లో ఓటీటీకి వస్తాయి. ఈ సినిమా నవంబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన, దీపావళి పండుగ ముగిసిన వెంటనే, నవంబర్ రెండో వారంలో (అంటే రిలీజ్ అయిన 4-5 వారాల తర్వాత) నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.

​నిర్మాత దానయ్యకు నాన్ థియేట్రికల్ పరంగా మంచి లాభాలు వచ్చాయి కాబట్టి, థియేట్రికల్ రన్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, కనీసం 4 వారాల గ్యాప్ ఇచ్చేలా నెట్‌ఫ్లిక్స్‌తో డీల్ కుదుర్చుకుని ఉండవచ్చు. ఓటీటీలో ఎప్పుడైతే ఈ సినిమా వస్తుందో, అప్పుడు ఎమోషనల్ సీన్స్ గురించి, యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి మరోసారి పెద్ద చర్చ మొదలవుతుంది. ఈ సినిమా ఓటీటీ బజ్ అనేది రాబోయే 'OG' ఫ్రాంచైజ్‌కు కూడా ఉపయోగపడవచ్చు. ​ఇక 290 కోట్ల గ్రాస్‌ను (అంచనా) అందుకున్న ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్లో ఎన్ని మిలియన్ల వ్యూస్ సాధిస్తుందో చూడాలి.