పవన్ ఓజీ.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్ ఏంటంటే?
ముంబై బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఓజీ మూవీ.. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
By: M Prashanth | 23 Oct 2025 3:23 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దసరా ముందస్తు కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజైన సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు కొన్ని గంటలుగా ఓటీటీలో సందడి చేస్తోంది.
ముంబై బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఓజీ మూవీ.. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్స్ లో సినిమాను ఫ్యాన్స్ రిపీట్ మోడ్ లో చూశారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కొందరు ఫ్యాన్స్ అయితే.. వరుసగా మూవీని థియేటర్స్ లో వీక్షించారు.
తాము పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలనుకుంటున్నామో.. ప్రెజెంటేషన్ ఎలా ఉండాలని ఆశపడ్డామో.. సుజీత్ అదే విధంగా చూపించారని ఇప్పటికే కొనియాడారు. సినిమాను కూడా అంతే రీతిలో పట్టం కట్టారు. ఇప్పుడు ఓటీటీలో కూడా రిపీట్ మోడ్ లో చూస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులతో సందడి చేస్తున్నారు.
కానీ కొందరు అభిమానులు ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. సినిమాకు సంబంధించిన అన్ కట్ వెర్షన్ ను మేకర్స్ స్ట్రీమింగ్ చేస్తున్నారని వారంతా ఆశించారట. కానీ ఇప్పుడు థియేట్రికల్ వెర్షన్ నే మళ్లీ ఓటీటీలోకి తీసుకురావడంతో డిలీటెడ్ సీన్స్ కూడా యాడ్ చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికైనా అన్ కట్ వెర్షన్ ను స్ట్రీమింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మేకర్స్ ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే వాటిపై ఇప్పటి వరకు మేకర్స్ ఏం స్పందించలేదు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది ఓజీ.
ఇక సినిమా విషయానికొస్తే.. పవన్ సరసన యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్, తేజ్ సప్రు, హరీష్ ఉత్తమన్, రాహుల్ రవీంద్రన్, అభిమన్యు సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ దాసరి రూపొందించారు.
