Begin typing your search above and press return to search.

'ఓజీ' ఓటీటీ స్ట్రీమింగ్‌... ఎప్పుడు? ఎక్కడ?

పవన్ కళ్యాణ్ హీరోగా సాహో సజీత్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఓజీ' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   18 Oct 2025 3:43 PM IST
ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్‌... ఎప్పుడు? ఎక్కడ?
X

పవన్ కళ్యాణ్ హీరోగా సాహో సజీత్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఓజీ' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. పవన్‌ కెరీర్‌లోనే టాప్‌ ఓపెనింగ్స్‌ను దక్కించుకున్న ఓజీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు దసరా కానుకగా వచ్చిన ఓజీ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఓజీ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయడం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్ అయిన తర్వాత నాలుగు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓజీ సినిమా సైతం దాదాపు నాలుగు వారాల గ్యాప్‌ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. థియేట్రికల్‌ రన్‌ పూర్తి కావడంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ అధికారిక ప్రకటన వచ్చింది.


ఓజీ థియేట్రికల్‌ రన్‌ పూర్తి

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ఓజీ సినిమాను సైతం భారీ మొత్తానికి గాను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. అక్టోబర్‌ 23న ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. పవన్‌ కళ్యాణ్‌ సినిమా అంటే మినిమం బజ్ ఉంటుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తి అయిన తర్వాత కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం మిలియన్‌ల కొద్ది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. టికెట్ల రేట్లు పెద్ద ఎత్తున పెంచడంతో మొదటి వారంలో చూడని వారు, ఆ తర్వాత కూడా వీలు పడని వారు ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి గుడ్‌ న్యూస్ చెప్పిన నెట్‌ఫ్లిక్స్‌ దీపావళి కానుకగా సినిమాను స్ట్రీమింగ్‌ చేసేందుకు రెడీ అయింది. ఈమధ్య కాలంలో ఓటీటీలో సౌత్‌ సినిమాలు అత్యధిక వ్యూస్‌ ను రాబడుతూ రికార్డ్‌లను నమోదు చేస్తున్న విషయం తెల్సిందే.

సుజీత్‌ దర్శకత్వంలో ఓజీ

సుజీత్‌ గత చిత్రం సాహో కి నార్త్‌ ఇండియాలో మంచి స్పందన వచ్చింది. ఆ బ్రాండ్‌ ఇమేజ్‌తో ఓజీ సినిమా ఖచ్చితంగా నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ ప్రేక్షకులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. హిందీ వర్షన్‌కి ఖచ్చితంగా అత్యధిక వ్యూస్‌ లభిస్తాయనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు, అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఓజీని తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ఈ సినిమా స్టైలిష్‌ యాక్షన్‌ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే. హిందీలో ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్ కి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా మంచి స్పందన దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓజీ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా అత్యధికంగా స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి పక్కా పైసా వసూల్‌ మూవీ

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ప్రతి సీన్ క్లైమాక్స్‌ రేంజ్‌ లో ఫీల్‌ అవుతూ ఎంజాయ్ చేసిన సినిమా ఓజీ. థియేట్రికల్‌ రిలీజ్‌ సమయంలో ఫ్యాన్స్ ఆహా ఓహో అంటూ సోషల్‌ మీడియాలో తెగ సందడి చేశారు. రెగ్యులర్‌ ప్రేక్షకులు కాస్త అటు ఇటుగా రివ్యూలు ఇచ్చారు. ఓవరాల్‌గా సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. సుజీత్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు తమన్‌ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనడంలో సందేహం లేదు. తమన్‌ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ తో ఫ్యాన్స్‌ ను లేచి నిల్చునేలా చేశాడు అనడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ ఎలివేషన్‌ సీన్స్ కోసం తమన్‌ అందించిన సంగీతం ది బెస్ట్‌ గా వచ్చింది. అందుకే ఓజీ సినిమా బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ బ్లాక్ బస్టర్‌ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటారో అలా ఈ సినిమాలో చూపించారు. అందుకే సినిమాను ఇంకా ఓటీటీలోనూ చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.