పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బిగ్ అలర్ట్
పవన్ కళ్యాణ్ ఇటీవల 'హరి హర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.
By: Ramesh Palla | 18 Aug 2025 4:55 PM ISTపవన్ కళ్యాణ్ ఇటీవల 'హరి హర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయిన కూడా ఫ్యాన్స్ తదుపరి సినిమా 'ఓజీ' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఫ్యాన్స్ ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ను చూడాలి అనుకుంటారో అలాగే ఈ సినిమాలో చూస్తారు అని తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, థీమ్ సాంగ్స్ ఇలా ప్రతి ఒక్కటీ ఆకట్టుకున్నాయి. అందుకే ఓజీ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఓజీ సినిమాతో థమన్ రీ సౌండ్
పవన్ కళ్యాణ్ సినిమా అనగానే థమన్ ఓ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడని ఇప్పటికే గత చిత్రాలను బట్టి అర్థం అయింది. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసే విధంగా సౌండ్ చేయడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అంతే కాకుండా ఓజీ సినిమా కాన్సెప్ట్‌కి తగ్గట్లుగా థమన్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చి ఉంటాడు అనే విశ్వాసంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన కొన్ని శాంపిల్స్ సినిమా స్థాయిని పెంచిన విషయం తెల్సిందే. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ మూడ్‌కి తగ్గట్లుగానే థమన్ మ్యూజిక్ ఉండబోతుంది. భారీ అంచనాల నడుమ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదల కానుంది. సుజీత్ ఈ సినిమాతో పవన్ స్టైలిష్ అవతార్‌ను చూపించబోతున్నాడు.
పవన్‌కు జోడీగా ప్రియాంక అరుల్
సినిమా విడుదలకు మరో నాలుగు వారాల సమయం మాత్రమే ఉన్న కారణంగా ప్రమోషన్ జోరు పెంచబోతున్నారు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ నుంచి అతి త్వరలో ఒక మెలోడీ సాంగ్ రాబోతుంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ లపై సాగే ఆ రొమాంటిక్ సాంగ్‌తో సినిమా స్థాయి పెరుగుతుందనే విశ్వాసంను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఆకట్టుకునే మ్యూజిక్‌తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను థమన్ సర్‌ప్రైజ్ చేస్తాడనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే మెలోడీ సాంగ్ ను రెడీ చేశాడని తెలుస్తోంది. ఓజీ నుంచి వచ్చే మెలోడీ తో సినిమా స్థాయి పెంచబోతున్నారు. ఆ వెంటనే ఐటెం సాంగ్‌తో థమన్ సందడి చేయబోతున్నాడు.
ఓజీలో స్పెషల్ సాంగ్
ఓజీ స్పెషల్ సాంగ్ గురించి పెద్దగా అప్‌డేట్ లేదు. కానీ థమన్ ది బెస్ట్ ఇచ్చాడంటూ మాత్రం ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలకు ప్రత్యేక సాంగ్స్ అత్యంత కీలకంగా ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు సైతం థమన్ ప్రత్యేక శ్రద్ద పెట్టి మరీ ఆ స్పెషల్ సాంగ్ ట్యూన్ చేశాడని సమాచారం అందుతోంది. ఆకట్టుకునే విధంగా కమర్షియల్ యాంగిల్ లో ఓజీ సాంగ్స్ ఉంటాయనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన తప్పు రిపీట్ కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు సుజీత్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. సుజీత్ గత చిత్రం సాహో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
