Begin typing your search above and press return to search.

'స‌లార్' త‌ర్వాత OG ది గ్రేట్ : శ్రీ‌యా రెడ్డి

ఓజీలో త‌న పాత్ర ప్ర‌త్యేక‌త గురించి శ్రీ‌యా రెడ్డి ఏదీ దాచ‌డం లేదు. ఈ పాత్ర చాలా వాస్త‌విక‌మైన‌ది.. క‌ఠిన‌మైన‌ది అని అభివర్ణించారు.

By:  Sivaji Kontham   |   4 Sept 2025 11:44 PM IST
స‌లార్ త‌ర్వాత OG ది గ్రేట్ : శ్రీ‌యా రెడ్డి
X

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెర‌కెక్కిస్తున్న గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామా OG రాక కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు ఈ నెల చివ‌రిలో సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. `దే కాల్ హిమ్ ఓజీ` ఈ సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టించిన శ్రీయా రెడ్డి మాట్లాడుతూ.. `స‌లార్` త‌ర్వాత ఇటీవల కాలంలో పోషించిన అత్యంత ప్రామాణికమైన న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న ఓజీలో చూస్తార‌ని తెలిపారు. ఓజీలో త‌న పాత్ర ప్ర‌త్యేక‌త గురించి శ్రీ‌యా రెడ్డి ఏదీ దాచ‌డం లేదు. ఈ పాత్ర చాలా వాస్త‌విక‌మైన‌ది.. క‌ఠిన‌మైన‌ది అని అభివర్ణించారు. ఇది కమర్షియల్ డ్రామా అయినా కానీ, నా లుక్స్‌- పెర్ఫార్మెన్స్ రెండింటిలోనూ వాస్తవానికి దగ్గరగా ఉండటం సంతోషాన్నిచ్ఛింద‌ని తెలిపింది.

వ‌య‌సు, శ‌రీరం బ‌య‌టికి క‌నిపించే ప్యాకేజీల‌ను నేను చూడ‌ను.. నేను ప్రామాణికమైన, అర్థవంతమైన, ఎగ్జ‌యిట్ చేసే పాత్రలను పోషించగలిగినంత కాలం పాత్ర వయస్సు లేదా శారీరక స్వరూపం పట్టించుకోను అని తెలిపారు. కాంప్లికేటెడ్ లేదా డీటెయిల్డ్ పాత్ర‌ల‌ను ఇష్ట‌ప‌డ‌తాన‌ని అన్నారు. ప్ర‌భాస్ `సలార్` చిత్రంలో రాధా రామ మన్నార్ అనే డెప్త్ ఉన్న‌ పాత్రలో న‌టించింది. ఓజీలో పాత్ర అంత‌కుమించి అల‌రిస్తుంద‌ని శ్రీయా రెడ్డి ప్రామిస్ చేస్తున్నారు.

ఓజీలో ప‌వ‌న్ ఓజాస్ గంభీర అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. విదేశాల నుంచి ముంబైకి భారీ మిష‌న్‌పై వ‌చ్చే గ్యాంగ్ స్ట‌ర్ గా ప‌వ‌న్ న‌టిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ మహిళా కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ ఓమి భావు పాత్రలో న‌టించారు. థ‌మ‌న్ సంగీతం అందించిన మూడు పాట‌లు విడుద‌ల చేయ‌గా అద్భుత స్పంద‌న వ‌చ్చింది.