OGతో హెల్త్ అప్సెట్ అయ్యేలా ఉందే: యువ హీరో
ఇప్పుడే సినిమాపై హైప్ ఇలా ఉంటే.. 25వ తేదీ తర్వాత ఎలా ఉంటుందోనని రాసుకొచ్చి.. పవన్ పోస్టర్ ను షేర్ చేశారు.
By: M Prashanth | 20 Sept 2025 1:51 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. మరో ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల అవ్వనుండగా.. ఇప్పటికే ఆడియన్స్ తోపాటు సినీ ప్రియులల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఓ రేంజ్ లో హోప్స్ క్రియేట్ అవ్వగా.. వాటిని తారాస్థాయికి చేర్చారు మేకర్స్. ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ.. ప్రమోషన్స్ లో ఫుల్ స్పీడ్ పెంచారు. సోషల్ మీడియాలో వరుసగా అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు.
ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్సెస్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏదేమైనా సినిమా కోసం ఆడియన్స్, సినీ ప్రియులు, పలువురు సెలబ్రిటీలు కూడా వెయిట్ చేస్తున్నారు. అందులో యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగొడ్డ కూడా ఒకరు. రీసెంట్ గా ఆయన స్పెషల్ పోస్ట్ పెట్టారు.
ఇప్పుడే సినిమాపై హైప్ ఇలా ఉంటే.. 25వ తేదీ తర్వాత ఎలా ఉంటుందోనని రాసుకొచ్చి.. పవన్ పోస్టర్ ను షేర్ చేశారు. "ఓజీ హైప్ కు హెల్త్ అప్సెట్ అయ్యేలా ఉంది. 25వ తేదీ వరకు ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే.. 25వ తేదీ తర్వాత ఏంటో పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు.." అని సిద్ధూ జొన్నలగడ్డ అన్నారు.
"ఆయన పవన్ కాదు.. తుఫాను.. సుజిత్ అన్ రియల్ మ్యాన్.. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ సర్, తమన్ బ్రో, నవీన్ నూలి అన్న" అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సిద్ధు పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పవన్ పోస్టర్ మెప్పిస్తోంది. అందులో ఆయన అదిరిపోయే లుక్ లో ఉన్నారు.
ఇక ఓజీ మూవీ విషయానికొస్తే.. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా సినిమా రూపొందుతోంది. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా సందడి చేయనున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా డీవీవీ ఎంటర్డైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
