Begin typing your search above and press return to search.

ఓజీ ఫైనల్ రన్ టైమ్ లాక్.. నిడివి ఎంతంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం 'OG' మరో 10 రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

By:  M Prashanth   |   15 Sept 2025 4:14 PM IST
ఓజీ ఫైనల్ రన్ టైమ్ లాక్.. నిడివి ఎంతంటే
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం 'OG' మరో 10 రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సినిమాకు ఉన్న హైప్ తో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే మేకర్స్ ఫైనల్ ఎడిట్ ని లాక్ చేశారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పవన్ కళ్యాణ్ తన పాత్రకు డబ్బింగ్ కూడా ఇటీవలే పూర్తి చేశారు. ఇక మంగళవారం ఓజీ సెన్సార్ ఫార్మాలిటీ పనులు పూర్తి చేసుకోనుంది. అయితే సెన్సార్ నుండి వచ్చిన చివరి కట్స్ ఆధారంగా ఈ చిత్రం ఫైనల్ రన్‌ టైమ్ దాదాపు 2 గంటల 30 నిమిషాలు ఉండే ఛాన్స్ ఉంది.

ఒక యాక్షన్ డ్రామాకు ఇది సరైన రన్‌ టైమే. 2.30 గంటలు అంటే 150 నిమిషాలు అన్నమాట. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలు, వీడియో గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా పవన్ బర్త్ డే కు రిలీజ్ చేసిన గ్లింప్స్ కు కూడా భారీ స్పందన వచ్చింది. వాస్తవానికి ఏ సినిమాకు లేని హైప్ ఓజీ మాత్రమే క్రియేట్ అయ్యింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 18న విడుదల కానుంది. అలాగే సెప్టెంబర్ 20న ఆంధ్రప్రదేశ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి రానున్నారని టాక్ వినిపిస్తుంది. ఇలా ప్రమషన్స్ లో జోరు పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే హీరో పవన్ కళ్యాణ్.. ప్రమోషన్స్ కోసం రిలీజ్ కు ముందు మూడు రోజులు ప్రమోట్ చేస్తారట.

సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించారు. ఇది ముంబయి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మి నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ కథానాయిక. ఓజీ డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.