ఓజిపై మరింత హైప్ ఎక్కిస్తున్న తమన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఓజి. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 30 Aug 2025 1:06 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఓజి. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజి సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. సెప్టెంబర్ 25న ఓజి ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారీ అంచనాలతో వస్తోన్న ఓజి
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రెండు సాంగ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ఫైర్ స్టార్మ్ సాంగ్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండో సాంగ్ గా వచ్చిన సువ్వి సువ్వి పాటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది.
మొదటి రెండు సాంగ్స్ సూపర్ రెస్పాన్స్
మొదటి రెండు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మేకర్స్ ఇప్పుడు థర్డ్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ను ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. త్వరలోనే ఓజి థర్డ్ సింగిల్ రాబోతుందని హింట్ ఇస్తూ తమన్ ఓ హెడ్ బ్యాండ్ ను పెట్టుకున్న ఇమేజ్ ను పోస్ట్ చేయగా అది నెట్టంట వైరల్ అవుతుంది. దీన్ని బట్టి త్వరలోనే ఈ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, ఈ సినిమాకు వర్క్ చేయడంపై తమన్ ముందు నుంచి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఓజి ఆల్బమ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని, ఓజి బీజీఎంకు ఫ్యాన్స్ కచ్ఛితంగా సర్‌ప్రైజ్ అవుతారని చెప్పుకుంటూ వస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.
