Begin typing your search above and press return to search.

పవన్ OG.. కేవలం కృష్ణ హక్కులే అన్ని కోట్లా?

అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ లు జరుగుతున్నాయి. మూవీకి ఆడియన్స్ లో వేరే లెవెల్ లో క్రేజ్ ఉండడంతో భారీ ధరకు రైట్స్ అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది.

By:  M Prashanth   |   29 Aug 2025 1:00 PM IST
పవన్ OG.. కేవలం కృష్ణ హక్కులే అన్ని కోట్లా?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఓజీ (They Call Him OG) మూవీ కోసం అటు అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.

ముంబై బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఓజీ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీ.. దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

నందమూరి బాలకృష్ణ అఖండ 2 దసరా రేసు నుంచి తప్పుకోవడంతో ఓజీకి మరింత ప్లస్ అయిందనే చెప్పాలి. ఎప్పుడో విడుదల కావాల్సిన మూవీ.. పవన్ బిజీగా ఉండటం వల్ల లేట్ అయింది. ఇప్పుడు పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఓవర్సీస్ లో సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ పడనుండగా.. రీసెంట్ గా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.

అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ లు జరుగుతున్నాయి. మూవీకి ఆడియన్స్ లో వేరే లెవెల్ లో క్రేజ్ ఉండడంతో భారీ ధరకు రైట్స్ అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు మూవీకి కీలక మార్కెట్లలో ఒకటైన కృష్ణా ఏరియాలో పవన్ కొన్నేళ్లుగా సత్తా చాటుతున్నారు. అన్ని సినిమాలతో సాలిడ్ వసూళ్లు సాధిస్తున్నారు.

ఆయన ఇప్పటికే నటించిన సినిమాలు అజ్ఞాతవాసి రూ.3.35 కోట్లు, వకీల్ సాబ్ రూ.4.80 కోట్లు రాబట్టాయి. భీమ్లా నాయక్ రూ.3.85 కోట్లు, బ్రో రూ.3.08 కోట్లతోపాటు రీసెంట్ గా వచ్చిన హరి హర వీర మల్లు అక్కడ రూ.4.15 కోట్లు వసూలు చేశాయి. ఇప్పుడు ఓజీ కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఆ అంచనాల మధ్య ఇప్పుడు కృష్ణా ఏరియా రైట్స్ ను రూ.10.60 కోట్లకు మేకర్స్ కోట్ చేశారని తెలుస్తోంది. పవర్ మూవీ వసూల్ చేసిన అత్యధిక కలెక్షన్స్ కు రెట్టింపు ఇది. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైప్ వల్ల అంత రేట్ కోట్ చేసినట్లు ఉన్నారని ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఓజీ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో.. కృష్ణా ఏరియాలో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.