ఓజీ జపాన్ రిలీజ్.. సందిగ్ధత వీడేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చి పవన్ ఫ్యాన్స్ కి కొత్త ఊపునిచ్చింది.
By: Madhu Reddy | 4 Nov 2025 6:38 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చి పవన్ ఫ్యాన్స్ కి కొత్త ఊపునిచ్చింది. హరిహర వీరమల్లు సినిమాతో నిరాశ పడ్డ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓజీ మూవీ కొత్త ఉత్సాహాన్ని నింపింది అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది. అలాంటి ఈ మూవీలో జపనీస్ నేపథ్యం కూడా ఉంది. అయితే ఈ సినిమాని జపాన్ లో విడుదల చేసే యోచన కూడా ఉన్నట్టు ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి. మరి అలాంటి ఓజీ మూవీ జపాన్ లో విడుదలకు వీలవుతుందా.. మేకర్స్ ఎలాంటి ప్లాన్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అంతేకాదు ఈ సినిమాకి ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అలాంటి ఈ సినిమాని జపాన్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపించినా.. ఇప్పటి వరకు ఓజీ మూవీ జపాన్ లో విడుదల గురించి ఎలాంటి వార్తలయితే వినిపించడం లేదు. కానీ ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన సుజీత్ గతంలో సాహో మూవీని జపాన్ లో విడుదల చేసి మంచి కలెక్షన్స్ వసూల్ చేశారు.
జపనీస్ నేపథ్యం లేని సాహో మూవీనే జపాన్ లో విడుదల చేసి హిట్ కొట్టారు. అలాంటిది జపనీస్ నేపథ్యం ఉన్న ఓజీ సినిమాని జపాన్ లో విడుదల చేసి హిట్ కొట్టలేరా అని చాలామంది భావించారు. పైగా ఓజి మూవీలో జపనీస్ నేపథ్యం ఉన్నప్పటికీ.. జపాన్లో జపనీస్ తో ఎలాంటి సంబంధం లేని సినిమాలే ఎక్కువగా హిట్ అవుతాయని, అక్కడి నేపథ్యంతో కనెక్టివిటీ లేని సినిమాలే అక్కడి ప్రేక్షకుల ఆదరణని పొందుతాయని తెలుస్తోంది. మరి ఇలాంటి టాక్ ఉన్న నేపథ్యంలో ఓజీ సినిమాని అక్కడ విడుదల చేస్తే హిట్ అవుతుందా అనే ఆలోచనలో పడ్డారట మేకర్స్..
అంతేకాదు సాలిడ్ ఎలిమెంట్స్ ఉన్న ఓజీ మూవీ జపాన్ లో విడుదల చేస్తే కచ్చితంగా హిట్ అవ్వదు అని కొంతమంది భావిస్తున్నారట. అందుకే జపనీస్ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఓజీ మూవీని జపాన్ లో విడుదల చేయడానికి మేకర్స్ ముందుకు రావడం లేదట. మరి చూడాలి భవిష్యత్తులో అయినా ఓజీ మూవీని జపాన్ లో విడుదల చేస్తారా లేదా అనేది.. ఇక ఓజీ మూవీ విషయానికి వస్తే.. సుజీత్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాని డివివి దానయ్య నిర్మించారు. అలాగే ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ లు కీ రోల్స్ పోషించారు.
