OG లో వాళ్లని సుజిత్ ఎలా వాడుకున్నాడో..?
సినిమాలో విలన్ గా బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ హష్మిని తీసుకున్నాడు. అతను ఒమి రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే.
By: Ramesh Boddu | 14 Sept 2025 3:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విషయంలో రోజు రోజుకి హైప్ డబుల్ అవుతుంది. సెప్టెంబర్ 25న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ ఇంకా 11 డేస్ మాత్రమే ఉన్న టైం లో ప్రమోషన్స్ ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఓజీ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే సినిమాలో పవర్ స్టార్ ఒక్కడు ఒక వైపు ఉండగా ఆయనతో పాటు భారీ తారాగణంతో నింపేశాడు సుజిత్.
బాలీవుడ్ రొమాంటిక్ స్టార్..
సినిమాలో విలన్ గా బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ హష్మిని తీసుకున్నాడు. అతను ఒమి రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే ఇమ్రాన్ ఫస్ట్ లుక్ టీజర్ క్రేజీగా అనిపించింది. అతనే కాదు సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ కూడా నటిస్తున్నాడు. సినిమాలో అతని రోల్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఓజీ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక ఇద్దరి పెయిర్ సినిమాకు ఫ్రెష్ నెస్ తెచ్చింది.
ఇప్పటివరకు యువ హీరోల సరసన నటించిన ప్రియాంక కెరీర్ లో ఫస్ట్ టైం ఒక స్టార్ తో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాతో అమ్మడి రేంజ్ పూర్తిగా మారిపోయేలా ఉంది. పవర్ స్టార్ ఓజీ సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి పీక్స్ లో హైప్ ఎక్కిస్తంది. ఓజీ కోసం డైరెక్టర్ సుజిత్ ఎంత కష్టపడుతున్నాడో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా అదే రేంజ్ లో కష్టపడుతున్నాడు. ఓజీకి ఈ రేంజ్ రావడానికి థమన్ ఇస్తున్న మ్యూజిక్ వల్లే అని చెప్పడంలో సందేహం లేదు.
ఫస్ట్ గ్లింప్స్ నుంచే సినిమా రేంజ్..
ఓజీ ఫస్ట్ గ్లింప్స్ నుంచే సినిమా రేంజ్ ఇది అని తెలిసేలా చేశాడు థమన్. ఇక రిలీజైన పవర్ స్టోర్మ్, సువ్వి సువ్వి సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. పవర్ స్టార్ ఓజీకి అన్ని పాజిటివ్ సైన్స్ గా ఉన్నాయి. ఇక సినిమా వచ్చి సంచలనాలు సృష్టించడమే మిగిలి ఉంది. పవర్ స్టార్ స్టిలిష్ లుక్స్ ఇంకా ఆయన స్వాగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ తో మరోసారి ఆయన బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ తో రికార్డ్ సృష్టిస్తున్న ఓజీ రిలీజ్ టైం లో ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.
సాహోతో బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించిన సుజిత్ ఆఫ్టర్ లాంగ్ టైం ఓజీ తో వస్తున్నాడు. మరి ఈ సినిమా సుజిత్ మార్క్ చూపిస్తుందా లేదా అన్నది చూడాలి.
