Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ ని వెంటాడుతోన్న బ్యాడ్ సెంటిమెంట్!

ఆ త‌ర్వాత చాలా కాలం పాటు మ‌ళ్లీ గ్యాంగ్ స్ట‌ర్ చిత్రాల‌వైపు వెళ్ల‌లేదు. వివిధ స్టోరీలు చేసుకుంటూ వ‌చ్చారు.

By:  Srikanth Kontham   |   15 Aug 2025 11:00 PM IST
ప‌వ‌ర్ స్టార్ ని వెంటాడుతోన్న బ్యాడ్ సెంటిమెంట్!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఓజీ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీ ఇది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాలు ప‌తాక స్థాయికి చేరాయి. ప‌వన్ క‌ళ్యాణ్ లుక్ స‌హా ప్ర‌తీది సినిమాకు మంచి బ‌జ్ ని తీసుకొచ్చింది. `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` ప్లాప్ అయిన నేప‌థ్యంలో అభిమానులంతా `ఓజీ`తో బౌన్స్ బ్యాక్ అవుతాడ‌ని చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ఇందులో సుజిత్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని స్టైలిష్ గా చూపించ‌బోతున్నాడు.

ఆ సినిమా ఫ‌లితం తారుమారు:

ప‌వ‌న్ రేంజ్ యాక్ష‌న్ కంటెంట్ ఉన్న చిత్రంగా అభిమానులు ఆశీస్తున్నారు. అయితే ఇక్క‌డే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఓ బ్యాడ్ సెంటి మెంట్ కూడా వెంటాడుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి గ్యాంగ్ స్ట‌ర్ చిత్రాలు పెద్ద‌గా క‌లిసిరాని చ‌రిత్ర ఉంది. ఆయ‌న కెరీర్ లో తొలిసారి `బాలు` అనే గ్యాంగ్ స్ట‌ర్ సినిమా చేసిన సంగ‌తి తెలి సిందే. అందులో గ్యాంగ్ స్ట‌ర్ గా ఉన్న ప‌వ‌న్ ప్రియురాలి కోసం త‌న డాన్ పైనే తిర‌గ‌బ‌డ‌తాడు. ఈ క‌థ అప్ప‌ట్లో చాలా మందికి క‌నెక్ట్ అవ్వ‌లేదు. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌లితం తారుమారుగా వ‌చ్చింది.

స్టైలిష్ యాక్ష‌న్ చిత్రంగా:

ఆ త‌ర్వాత చాలా కాలం పాటు మ‌ళ్లీ గ్యాంగ్ స్ట‌ర్ చిత్రాల‌వైపు వెళ్ల‌లేదు. వివిధ స్టోరీలు చేసుకుంటూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే `పంజా`తో సీన్ లోకి వ‌చ్చారు. విష్ణు వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `పంజా` కథ కూడా `బాలు` లాగే ఉటుంది. కాక‌పోతే ఇందులో పాత్ర‌ల్ని స్టైలిష్ గా ఎలివేట్ చేసారు. ప‌వ‌న్ పాత్ర‌లో స్టైలిష్ యాక్ష‌న్ హైలైట్ అవుతుంది. ప‌వ‌న్ గెడ్డం లుక్ కూడా ప్రేక్ష‌కుల‌కు కొత్త ఫీల్ ని అందించింది.

ఓజీపై భారీ అంచ‌నాలు:

`బాలు` ఫెయిలైన నేప‌థ్యంలో `పంజా` భారీ విజ‌యం గ్యారెంటీ అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఆత‌ర్వాత మ‌ళ్లీ గ్యాంగ్ స్ట‌ర్ క‌థ‌ల్ని ట‌చ్ చేయ‌లేదు. మ‌ళ్లీ 15 ఏళ్ల‌కు `ఓజీ`తో ఆ జాన‌ర్ లోకి ఎంట‌ర్ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో `ఓజీ` పాత సెంటిమెంట్ ను తిర‌గ రాస్తుంద‌ని అభిమానులు ఎదురు చూస్తున్నారు.