Begin typing your search above and press return to search.

పవన్ 'ఓజీ'.. సెన్సార్ ఎఫెక్ట్ ఉంటుందా?

దీంతో మేకర్స్.. ఏ సర్టిఫికేట్‌ తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పాలి. అయితే సెన్సార్ నిబంధనల ప్రకారం ఏ సర్టిఫికేట్ జారీ చేస్తే.. సదరు సినిమాను పెద్దలకు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.

By:  M Prashanth   |   22 Sept 2025 10:28 PM IST
పవన్ ఓజీ.. సెన్సార్ ఎఫెక్ట్ ఉంటుందా?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ విడుదలకు సమయం దగ్గరపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సినిమాను పెద్ద ఎత్తున సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. యమా జోష్ లో జరుగుతున్నాయి.

ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అదే సమయంలో తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేశారు. సెన్సార్ బోర్డు అధికారుల నుంచి ఊహించని విధంగా 'ఏ' సర్టిఫికేట్ అందుకున్నారు. ఆ విషయాన్ని మేకర్స్ తాజాగా వెల్లడించారు. స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

అయితే సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికేట్ అందుకోవాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దాని కోసం.. సెన్సార్ బోర్డు అధికారుల సూచనలు పాటించారని సమాచారం. చాలా మార్పులు చేయాల్సి వచ్చిందని వినికిడి. మార్పుల విషయంలో తమ వంతు ప్రయత్నం చేశారని టాక్ వినిపిస్తోంది. కానీ అనుకున్నట్లు జరగలేదు.

దీంతో మేకర్స్.. ఏ సర్టిఫికేట్‌ తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పాలి. అయితే సెన్సార్ నిబంధనల ప్రకారం ఏ సర్టిఫికేట్ జారీ చేస్తే.. సదరు సినిమాను పెద్దలకు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. థియేటర్స్ లో 18 ఏళ్లలోపు పిల్లలు, టీనేజర్లు మూవీ చూడడం నిషేధం. దీంతో కచ్చితంగా సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గే ఛాన్స్ ఉంది.

పండుగల టైమ్ లో సినీ ప్రియులు.. థియేటర్స్ లో సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇప్పుడు A సర్టిఫికేట్ అందుకోవడంతో పిల్లలు సినిమా చూడటానికి అనుమతులు లేవు. అయితే మల్టీ ప్లెక్స్‌ లు సాధారణంగా ఆ నియమాన్ని కచ్చితంగా పాటిస్తున్నాయి..

కానీ గ్రామీణ ప్రాంతాల్లోని అనేక సింగిల్ స్క్రీన్‌ లు, B & C సెంటర్‌ లు ఆ నిబంధనలను కఠినంగా ఏం పాటించవు. దీంతో అది మేకర్స్ కి పాజిటివ్ గా మారనుంది. అయితే మేకర్స్ రీసెంట్ గా ఓజీ కన్సర్ట్ ను నిర్వహించారు. మరి ఇప్పుడు ఓజీ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి ఉండాలి.