Begin typing your search above and press return to search.

బుక్ మై షో టాప్ బుకింగ్స్.. ఇది OG లెక్క!

దేవర కూడా 6 లక్షల టికెట్లు అమ్మి టాప్ 3లో తన స్థానాన్ని సంపాదించుకుంది. పవన్ కల్యాణ్ ఓజీ 4.3 లక్షల టికెట్లతో నాలుగో స్థానంలో నిలవగా, గేమ్ ఛేంజర్ ఆ తరువాత స్థానంలో ఉంది.

By:  M Prashanth   |   26 Sept 2025 4:48 PM IST
బుక్ మై షో టాప్ బుకింగ్స్.. ఇది OG లెక్క!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నప్పుడల్లా అభిమానుల్లో మామూలు ఉత్సాహం ఉండదు. ఈసారి ఓజీ కూడా అదే రేంజ్‌లో ఫ్యాన్స్‌ని థియేటర్లకు రప్పించింది. రిలీజ్ డే రోజే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం, బుక్ మై షో (BMS) ప్లాట్‌ఫామ్‌లో పెద్ద సంఖ్యలో సేల్స్ జరగడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ట్రేడ్ అంచనాల ప్రకారం, ఓజీ రిలీజ్ డే రోజే బుక్ మై షోలో సుమారు 4.3 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్యతో పవన్ సినిమా టాప్ 10 లిస్ట్‌లో ఒక బలమైన స్థానాన్ని దక్కించుకుంది. అయితే మరోవైపు చాలా టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్ లో కూడా అమ్ముడవడం వల్ల అధికారికంగా BMSలో పూర్తిగా హైలెట్ కాలేదని చెబుతున్నారు. అయినా కూడా పవన్ పవర్ రేంజ్ ఏంటో ఈ రికార్డ్ మరోసారి చూపించింది.

ఈ జాబితాలో అగ్రస్థానంలో పుష్ప 2 ఉంది. బుక్ మై షోలో 17.5 లక్షల టికెట్లు రిలీజ్ డే రోజే అమ్ముడవడం రికార్డు అని చెప్పవచ్చు. తర్వాత స్థానంలో కల్కి 2898 ఏడీ 11 లక్షల టికెట్లతో నిలిచింది. దేవర కూడా 6 లక్షల టికెట్లు అమ్మి టాప్ 3లో తన స్థానాన్ని సంపాదించుకుంది. పవన్ కల్యాణ్ ఓజీ 4.3 లక్షల టికెట్లతో నాలుగో స్థానంలో నిలవగా, గేమ్ ఛేంజర్ ఆ తరువాత స్థానంలో ఉంది.

బుక్ మై షో మొదటి రోజు టాప్ సేల్స్ (ట్రేడ్ అంచనాల ప్రకారం)

పుష్ప 2: 1.75 మిలియన్

కల్కి 2898 ఏడీ: 1.1 మిలియన్

దేవర: 600K

ఓజీ: 430K

గేమ్ ఛేంజర్: 400K

సంక్రాంతికివస్తున్నాం: 385K

మిరాయ్: 375K

ఈ లిస్ట్ చూస్తే, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ డే రోజే ఎలా హంగామా చేశాయో అర్థమవుతోంది. అయితే ఈ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో మిగతా భాషల్లో కూడా భారీగా రిలీజ్ అయ్యాయి. ఇక పుష్ప 2 అంచనాలకు మించి సెన్సేషన్ సృష్టించగా, కల్కి సైన్స్ ఫిక్షన్ సినిమాగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అదే సమయంలో దేవర బలమైన మాస్ బజ్‌తో రికార్డ్ బుకింగ్స్ సాధించింది.

ఇక పవన్ ఓజీ విషయానికి వస్తే, బుక్ మై షో లెక్కల ప్రకారం 4.3 లక్షల టికెట్లు మాత్రమే కనిపించినప్పటికీ, డిస్ట్రిక్ట్ స్థాయిలో మరింత ఎక్కువ సేల్స్ జరిగినట్లు ట్రేడ్ టాక్. అంటే, మొత్తం ఫిగర్స్ ఇంకా హై రేంజ్‌లో ఉన్నాయన్న మాట. ఈ సంఖ్యలు పవన్ మాస్ స్టామినా, ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరోసారి రుజువుచేస్తున్నాయి. మొత్తం మీద బుక్ మై షోలోనూ, ఆఫ్‌లైన్ సేల్స్‌లోనూ పవన్ సినిమా స్ట్రాంగ్ ఓపెనింగ్ కొట్టింది. ఇక వీకెండ్ లో దసరా సెలవులు కూడా కలిసొచ్చి వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.