Begin typing your search above and press return to search.

పవన్ OG.. హాలీవుడ్ మూవీకి లింకా? ఆ సినిమా పేరు ఇదేనా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ (They Call Him OG) మూవీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   25 Sept 2025 4:00 PM IST
పవన్ OG.. హాలీవుడ్ మూవీకి లింకా? ఆ సినిమా పేరు ఇదేనా?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ (They Call Him OG) మూవీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ ఓజాస్ గంభీరగా కనిపించి మెప్పించారు.

హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్.. విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించి అలరించారు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, సుదేవ్ నాయర్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటించారు. నిర్మాత డీవీవీ దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా.. ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

సినిమా అదిరిపోయిందని.. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని కొందరు సినీ ప్రియులు కొనియాడుతున్నారు. సుజీత్ మేకింగ్ అండ్ టేకింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఇంకొందరు సెకండాఫ్ ల్యాగ్ చేశారని అంటున్నారు. కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ లేవని అంటున్నారు. దీంతో ఓజీ మూవీ.. మిక్స్ డ్ బ్యాగ్ లా ఉంటుందని తెలుస్తోంది.

అదంతా ఒకెత్తు అయితే.. ఇప్పుడు న్యూయార్క్ కు చెందిన కొందరు సినీ ప్రియులు.. ఓజీ మూవీ మేకర్స్ హాలీవుడ్ సినిమాను చూసి సుజీత్ ఇన్స్పైర్ అయ్యినట్లు ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు. జాన్ విక్ మూవీతో దాదాపు లింక్ చేసినట్లు ఉందని చెబుతున్నారు. అయితే తెలుగు సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారని.. అంతే తప్ప పెద్దగా ఏం లేదని అంటున్నారు.

ఇంకొందరు సుజీత్ దర్శకత్వం వహించిన సాహో మూవీనే బాగుందని కూడా అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి.. హాలీవుడ్ మూవీస్ ఫాలో అయ్యే వారికి జాన్ విక్ ఫ్రాంచైజీ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు ఆ యాక్షన్ ఫ్రాంచైజీ లో భాగంగా నాలుగు సినిమాలు వచ్చాయి.

జాన్ విక్ మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే.. లీడ్ రోల్ ను హాలీవుడ్ నటుడు కీన్ రీవ్స్ పోషించారు. సినిమాల్లో ఆయన గ్యాంగ్ స్టర్ గా అండర్ వరల్డ్ లో ఉంటాడు. అప్పుడు తన భార్యను కోల్పోతాడు. ఆ తర్వాత సైలెంట్ అవుతాడు. కానీ తన ఇంట్లోకి చొరబడి కుక్కను చంపినప్పుడు ప్రతీకారం తీర్చుకోవటానికి మళ్లీ నేర ప్రపంచంలోకి తిరిగి వస్తాడు.

ఇప్పుడు ఓజీలో.. ఓ రాజుకు రక్షణగా నిలిచే యోధుడు (పవన్) కొంతకాలం దూరమవుతాడు. దీంతో చాలా ఘటనలు జరుగుతాయి. రాజుకి, రాజ్యానికి కష్టం వచ్చిందని తెలిశాక ఆ యోధుడు మళ్ళీ తిరిగొస్తాడు. అతను వచ్చాక ఏం జరిగిందన్నది ఓజీ కథ. దీంతో రెండు స్టోరీ లైన్స్ ను కంపేర్ చేసి న్యూయార్క్ సినీ ప్రేమికులు.. హాలీవుడ్ మూవీకి ఇన్స్పెర్ అయ్యి ఓజీ తీశారని అంటున్నారు. దీనిపై మేకర్స్ ఏమైనా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.