నార్త్ లోనూ దుమ్ము లేపుతున్న ఓజి
పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాకు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించారు.
By: Sravani Lakshmi Srungarapu | 19 Aug 2025 11:58 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల పాటూ సెట్స్ పైనే ఉన్న ఈ సినిమా జులై 24న రిలీజైంది. ఏదో చాలా రోజుల తర్వాత పవన్ ను స్క్రీన్ పై చూశామనే సంతృప్తి తప్పించి ఈ సినిమాతో ఫ్యాన్స్ కు ఉన్న ఆకలైతే తీరలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఓజి సినిమాపైనే పడింది.
అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్
పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాకు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజి సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఓజి సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ ఉంది. సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ రిలీజయ్యాక ఆ హైప్ ఇంకాస్త పెరిగింది.
సినిమాలోని యాక్టర్లు, టెక్నీషియన్లు మరియు ఓజి గురించి చిత్ర యూనిట్ పలు సందర్భాల్లో చెప్పిన మాటలు ఫ్యాన్స్ ను ఎంతగానో ఎగ్జైట్ చేస్తున్నాయి. అయితే ఓజిపై సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా భారీ అంచనాలున్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాలకు నార్త్ లో మంచి డిమాండ్ ఉండటంతో ఓజి సినిమాపై కూడా అక్కడి వాళ్లు కన్నేశారు. ఆ డిమాండ్ వల్లే ఓజికి సంబంధించిన హిందీ శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.
స్టార్ గోల్డ్ కు ఓజి హిందీ శాటిలైట్ రైట్స్
ఓజి హిందీ శాటిలైట్ రైట్స్ కోసం పలు ఛానెల్స్ పోటీ పడగా, ఆఖరికి ఆ హక్కులను స్టార్ గోల్డ్ టీవీ ఛానెల్ భారీ మొత్తానికి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఈ డీల్ కోసం సదరు ఛానెల్ నిర్మాణ సంస్థకు ఎన్ని కోట్లు చెల్లించిందనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. రీసెంట్ టైమ్స్ లో ఏ తెలుగు సినిమాకీ రానంత మొత్తంలో ఈ డీల్ జరిగిందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.
గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్
పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య ఓజి సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.
