ఓజీ మేకర్స్ తప్పు చేస్తున్నారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన అప్ కమింగ్ పాన్ఇండియా చిత్రం ఓజీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
By: M Prashanth | 5 Sept 2025 7:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన అప్ కమింగ్ పాన్ఇండియా చిత్రం ఓజీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఈ సినిమాలో విలన్ గా కనిపించానున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న థియేటర్లో విడుదల కానుంది. అంటే కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే ఓజీ ప్రీ బుకింగ్స్ లో దూసుకుపోతోంది.
అయితే సెప్టెంబర్ 2న, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా OG మేకర్స్ అభిమానులల్లో జోష్ నింపేందుకు స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. ప్రత్యేక OG vs OMI గ్లింప్స్ వీడియోను విడుదల చేసి ఫ్యాన్స్ లో ఇంకా అంచనాలు తారా స్థాయికి చేర్చింది. ఈ గ్లింప్స్ వీడియో కు సుూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇది సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.
తెలుగు వెర్షన్ తర్వాత రెండు రోజుల గ్యాప్ తర్వాత మేకర్స్ అదే OG vs OMI గ్లింప్స్ ను తమిళం, హిందీ వెర్షన్ల లోనూ విడుదల చేశారు. అక్కడి ఆడియెన్స్ కు కూడా గ్లింప్స్ నచ్చాయి. కానీ, వీడియో చూసిన తర్వాత హిందీ అడియెన్స్ కు అర్థమైంది ఏంటంటే... ఈ సినిమా కథలో ఎక్కువ భాగం ముంబైలో జరుగుతుందని. అయితే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నప్పటికీ.. హిందీ బెల్ట్ లో సినిమాకు మంచి ప్రమోషన్స్ చేయలేదని అక్కడి అభిమానులు ఫీల్ అవుతున్నారు.
అందుకే అలా కాకుండా సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ను తెలుగుతోపాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. పవన్ -ఇమ్రాన్ ఇద్దరూ నటించిన OG vs OMI పాత్రలకు ఒకే లెవెల్ ఆదరణ దక్కుతుంది. అదే స్థాయిలో ప్రమోషన్ చేసినట్లవుతుంది. ఇక సనాతన ధర్మ పరి రక్షకుడిగా ఇటీవల నార్త్ లో విడుదలైన హరి హర వీర మల్లుకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
ఇక ఇప్పుుడు OG సినిమా ఈ బార్డర్లను బద్దలు కొట్టి పాన్ఇండియా రేంజ్ లో పవన్ కళ్యాణ్ ను స్టార్ గా చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అంచనాలు కూడా ఆ రేంజ్ లో ఉండడంతో ఇది జరగడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఉన్న ఈ మూడు వారాల టైమ్ ను మేకర్స్ హిందీలోనూ ప్రమోషన్స్ కు ఉపయోగించుకోవాలి. అప్పుడే ఓజీ హిందీలోనూ ఆదరణ దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది.
