Begin typing your search above and press return to search.

పవన్ OG.. తెలుగు రాష్ట్రాల్లో సౌండ్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ లో నటించిన ఓజీ (They Call Him OG) మూవీ నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే

By:  M Prashanth   |   25 Sept 2025 12:37 PM IST
పవన్ OG.. తెలుగు రాష్ట్రాల్లో సౌండ్ ఎలా ఉందంటే?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ లో నటించిన ఓజీ (They Call Him OG) మూవీ నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా ప్రీమియర్స్ నిన్న రాత్రి అనేక చోట్ల పడగా.. నేడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్స్ లో విడుదలైంది.

ఇప్పటికే ప్రీమియర్స్ రూపంలో అనేక మంది సినిమా చూడగా.. ఇప్పుడు థియేటర్స్ లో కొన్ని లక్షల మంది సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద సందడి మామూలుగా లేదు. మొత్తం థియేటర్స్ లో దాదాపు ఓజీ సినిమానే రిలీజ్ అవ్వగా.. సందడి వాతావరణం నెలకొంది.

అభిమానులు.. సినీ ప్రియులు.. థియేటర్స్ బయట ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్.. ఓజీ.. అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ భారీ కటౌట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. సినిమాను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఓజీ మూవీ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేస్తుందని చెప్పాలి.

అదే సమయంలో మిరాయ్, లిటిల్ హార్ట్స్ సినిమాల మేకర్స్.. ఓజీ కోసం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమ సినిమాల షోలను నిలిపివేసి మరీ ఓజీకి ఛాన్స్ ఇచ్చారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని థియేటర్స్ లో పవన్ సినిమా మ్యానియా నడుస్తోంది. ఓజీ వైబ్సే రాష్ట్రాల మొత్తం కనిపిస్తున్నాయి.

అయితే పవన్‌ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం పవన్ దుమ్మురేపారని కామెంట్లు పెడుతున్నారు. వన్ మేన్ షో అని చెబుతున్నారు. సుజీత్ స్టైలిష్ మేకింగ్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టిందని చెబుతున్నారు. అలా డైరక్టర్ మేకింగ్ ఒకెత్తు అయితే.. తమన్ మ్యూజిక్ మరో ఎత్తు అని.. అంటున్నారు. మరో పక్క సాధారణ ప్రేక్షకులు సుజీత్ రేంజ్ లో మూవీ లేదు అని ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ అఫ్ వీక్ గా ఉంది అని సుజీత్ గత సినిమాలే ఇంకా బాగున్నాయి అని చెబుతున్నారు .

సినిమా విషయానికి వస్తే, ఇమ్రాన్ హాష్మీ విలన్‌గా, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌ గా నటించారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, సుధేవ్ నైర్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ నిర్మించిన ఆ భారీ యాక్షన్ ఎంటర్టైనర్.. ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుని.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు కురిపిస్తోంది.