తమన్ ఇకనైనా ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందే!
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి సినిమా నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూసిన ఫస్ట్ లిరికల్ వచ్చేసింది.
By: Sravani Lakshmi Srungarapu | 3 Aug 2025 11:14 PM ISTపవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి సినిమా నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూసిన ఫస్ట్ లిరికల్ వచ్చేసింది. ఎప్పట్నుంచో పవన్ ఈ సాంగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని చెప్పుకుంటూనే వస్తున్న నేపథ్యంలో ఓజి ఫస్ట్ సాంగ్ పై మంచి హైప్ ఏర్పడింది. తమన్ చెప్పినట్టే ఓజి ఫస్ట్ లిరికల్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, ఇంగ్లీష్, జపాన్ లాంగ్వేజెస్ ను కలిపి రాయించిన డిఫరెంట్ లిరిక్స్, దానికి తమన్ ఇచ్చిన ట్యూన్, ఫాస్ట్ బీట్స్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తున్నాయి.
ఫస్ట్ లిరికల్ తో ఫ్యాన్స్ ను మెప్పించిన తమన్
ఆల్రెడీ ఈ సాంగ్ వ్యూస్ విషయంలో రికార్డులను కూడా సృష్టిస్తోంది. సమయం సందర్భం లేకుండా ఎక్కడికెళ్లినా ఓజి.. ఓజి అంటూ జపం చేస్తున్న పవన్ ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలను నెరవేర్చి డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇద్దరూ గెలిచారు. రియల్ సీన్స్ కు యానిమేషన్ షాట్స్ ను యాడ్ చేస్తూ చూపించిన విజువల్స్.. సాంగ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి.
నార్మల్ ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్
అయితే సాంగ్ వినడానికి బావున్నా, చార్ట్ బస్టర్ అయ్యే లక్షణాలున్నప్పటికీ ఫ్యాన్స్ కు కాకుండా నార్మల్ ఆడియన్స్ కు ఈ సాంగ్ ఎంతవరకు ఎక్కుతుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ డౌట్ రావడానికి కారణం సోషల్ మీడియాలో ఓజి ఫస్ట్ సాంగ్ కు వస్తున్న రెస్పాన్సే. మొదటి నుంచీ టైటిల్ సాంగ్స్ కంపోజిషన్ లో తమన్ కు దేవీ శ్రీ ప్రసాద్ కు ఉన్నంత పట్టు లేదనే కామెంట్ వినిపిస్తూనే ఉంది.
ఆ విషయంపై ఫోకస్ చేయాలి
టైటిల్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో దేవీ శ్రీ ప్రసాద్ చాలా స్పెషల్. దేవీ కంపోజ్ చేసిన ఎన్నో టైటిల్ ట్రాక్స్ ఇప్పటికీ మంచి రిపీట్ వాల్యూతో వింటూంటారు ఆడియన్స్. కానీ తమన్ మాత్రం కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈ విషయంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సాంగ్ రిలీజ్ టైమ్ లో సాంగ్ కు మంచి రీచ్ వచ్చి చార్ట్‌బస్టర్ అయినా ఆ తర్వాత ఎక్కువకాలం గుర్తుండిపోయే పాటలను తమన్ ఇవ్వలేకపోతున్నారు. అసలే దేవీతో టఫ్ కాంపిటీషన్ ఉన్న తమన్ ఈ విషయంపై కాస్త ఫోకస్ చేస్తే బావుంటుందని నెటిజన్లు అభిప్రాయ పడుతూ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఫస్ట్ లిరికల్ తో ఓజి సినిమాపై ఉన్న అంచనాలు మాత్రం ఇంకా పెరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
