'ఓజీ'.. పవన్ కళ్యాణ్ ప్లాన్ ఇలా..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (They Call Him OG) సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 12 Sept 2025 2:58 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (They Call Him OG) సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా గ్రాండ్ గా రూపొందుతున్న ఆ సినిమాలో పవన్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. ఓజాస్ గంభీరగా ఓజీలో సందడి చేయనున్నారు.
అయితే ఓజీతో పవర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని అంతా ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వేరే లెవెల్ లో హైప్ క్రియేట్ అయ్యి ఉంది. దీంతో పవన్ ఖాతాలో హిట్ పక్కా అని అంటున్నారు. రీసెంట్ గా హరిహర వీరమల్లుతో నిరాశపరిచిన ఆయన.. ఇప్పుడు కంబ్యాక్ ఇస్తారని చెబుతున్నారు.
అదే సమయంలో వీరమల్లు మూవీకి తనవంతుగా ప్రమోట్ చేసిన ఆయన.. ఇప్పుడు ఓజీ విషయంలో ఏం చేస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉండగా.. పవన్ ప్రమోషన్స్ లో పాల్గొంటే ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే మేకర్స్ తో పవన్ మాట్లాడారట.
తాను మూడు రోజుల పాటు సినిమాను ప్రమోట్ చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్.. ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే మేకర్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో పాటు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. దీంతో ట్రైలర్ లాంఛ్ కు పవన్ అటెండ్ అవుతారని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డౌటేనని టాక్.
అయితే ఆ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి వస్తారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మీడియాకు వరుస ఇంటర్వ్యూలను పవన్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. వీరమల్లు టైమ్ లో కూడా అనేక మీడియాలతో మాట్లాడారు. ఇప్పుడు కూడా అలాగే చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ ప్రణాళిక గురించి బయటకు రాలేదు.
కాగా, ఓజీ విషయానికొస్తే.. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సిరి లెళ్ల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుందీ చిత్రం.
