OG: పవన్ పని మొదలైంది!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ రిలీజ్ కు రెడీ అవుతోంది.
By: M Prashanth | 13 Sept 2025 6:04 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాలో పవన్ పవర్ ఫుల్ రోల్ లో సందడి చేయనున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో ఆయన పాత్ర అండ్ లుక్స్ పై వేరే లెవెల్ అంచనాలు నెలకొన్నాయి.
దీంతో పవన్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని అటు అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఫిక్స్ అయ్యారు. ఓజీ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ షూటింగ్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నారు. రిలీజ్ కు ఇంకా కొన్ని రోజుల ఉండగా.. ఇప్పుడు కీలక అప్డేట్ బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ తన రోల్ కు గాను డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. తన పొలిటికల్ బిజీ షెడ్యూల్ లో కూడా తన వంతు కర్తవ్యంగా ఓజీ డబ్బింగ్ మొదలు పెట్టినట్లు సమాచారం.
హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రముఖ డబ్బింగ్ ఇంజనీర్ పప్పు పర్యవేక్షణలో పవన్ డబ్బింగ్ చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో ఆ విషయం న్యూస్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది.
అయితే పవన్ కల్యాణ్.. తన గత చిత్రం హరిహర వీరమల్లు డబ్బింగ్ ను నాలుగు గంటల్లో కంప్లీట్ చేశారని అప్పట్లో టాక్ వినిపించింది. ఓజీ షూటింగ్ చేసి వచ్చి, అర్ధరాత్రి రెండు గంటల వరకు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు కూడా పొలిటికల్ బిజీ ఉండడంతో తొందరగా కంప్లీట్ చేయనున్నారని వినికిడి.
ఇక ఓజీ విషయానికొస్తే.. పవన్ సరసన యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సిరి లెళ్ల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మరి ఓజీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
