అప్పుడు సీజ్ ద షిప్.. ఇప్పుడు బగుల్ బువా..!
పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఎంత పాపులర్ అన్నది తెలిసిందే. ట్రెండ్ ఫాలో అవని పవర్ స్టార్ దాన్ని ఎప్పటికప్పుడు సెట్ చేస్తూ వచ్చాడు.
By: Ramesh Boddu | 28 Oct 2025 12:48 PM ISTపవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఎంత పాపులర్ అన్నది తెలిసిందే. ట్రెండ్ ఫాలో అవని పవర్ స్టార్ దాన్ని ఎప్పటికప్పుడు సెట్ చేస్తూ వచ్చాడు. ఈ తరం యూత్ ఆడియన్స్ కి కూడా ఆయన అంటే అంత అభిమానం. అందుకే పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కి అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఐతే ఆ డైలాగ్స్ ప్రభావం మరింత పెంచేందుకు ఆయన వాడిన డైలాగ్స్ ని సినిమా టైటిల్స్ గా వాడేస్తున్నారు. ఈమధ్యనే ఆయన పొలిటికల్ అటెన్షన్ లో భాగంగా సీజ్ ద షిప్ అనే కామెంట్ తెలిసిందే.
పవన్ కళ్యాణ్ OG సినిమాలో..
పవన్ అన్నాడు ఆ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. వెంటనే సీజ్ ద షిప్ అనే టైటిల్ ని ఫిల్మ్ నగర్ లో రిజిస్టర్ చేశాడు. సీజ్ ద షిప్ అనగానే కచ్చితంగా అందరికీ పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. అలా ఆయన అన్న డైలాగ్ ని టైటిల్ గా వాడేస్తున్నారు. సీజ్ ద షిప్ టైటిల్ రిజిస్టర్ అయ్యింది. ఇప్పుడు ఇదే వరుసలో మరో టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో వాడిన పదం బగుల్ బువా. ఈ డైలాగ్ కూడా ఓజీ సినిమా వల్ల పాపులర్ అయ్యింది. లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో బగుల్ బువా టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారట మేకర్స్. మొత్తానికి పవన్ సినిమాలే కాదు సినిమాల్లో, బయట ఆయన వాడుతున్న మాటలను కూడా టైటిల్స్ గా పెడుతున్నారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ కి నిదర్శనం అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు.
పవన్ డైలాగ్స్ ని టైటిల్స్..
సీజ్ ద షిప్, బగుల్ బువా టైటిల్ ఏదైనా అది పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి అవి పాపులారిటీ తెచ్చుకున్నాయి. ఐతే పవన్ మీద అభిమానం తో పాటు ఇలాంటి టైటిల్ సినిమాకు అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో కూడా ఆ టైటిల్స్ ని రిజిస్టర్ చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా సీజ్ ద షిప్, బగుల్ బువా ఇలా పవన్ డైలాగ్స్ ని టైటిల్స్ లా వాడటం ఆడియన్స్ లో కూడా ఆసక్తికరంగా ఉంది.
మరి ఈ టైటిల్స్ తో సినిమాలు ఎంత మేరకు ఇంపాక్ట్ చూపిస్తాయన్నది చూడాలి. ఓజీ సినిమాను సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించగా సినిమాకు థమన్ మ్యూజిక్ విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
