టాలీవుడ్ టాప్ డే 1 షేర్స్.. OG ఈ లెక్కను బ్రేక్ చేస్తుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: M Prashanth | 27 Aug 2025 1:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ స్టార్ నుంచి రాబోతున్న నెక్స్ట్ చిత్రం ఓజీ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. సెప్టెంబర్ 25న దసరా కానుకగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్‌ని పిచ్చెక్కిస్తోంది. మేకర్స్ ఇచ్చిన ప్రతి అప్‌డేట్‌కి సోషల్ మీడియాలో సాలీడ్ రెస్పాన్స్ రావడం చూసి పవన్ మాస్ క్రేజ్ ఇంకా ఎక్కడా తగ్గలేదని స్పష్టమవుతోంది.
ఈసారి ఓజీకి సోలో రిలీజ్ వాతావరణం దొరకడం మరో పెద్ద ప్లస్‌గా మారింది. ఇతర పెద్ద సినిమాలు ఏవీ పోటీగా లేనందున మొత్తం స్క్రీన్స్ దాదాపు ఓజీదే కానున్నాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశముంది. పైగా ఓవర్సీస్‌లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సాలీడ్ గానే ఉండే అవకాశం ఉంది.
టాలీవుడ్‌లో ఇప్పటివరకు చాలా సినిమాలు డే 1 వద్ద బాక్సాఫీస్ కలెక్షన్లలో దుమ్ము రేపాయి. ఆ లిస్టులో రాజమౌళి మాస్టర్‌పీస్ RRR 73.97 కోట్ల షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. దాని వెంటనే పుష్ప 2, దేవర, సలార్ సినిమాలు ఉన్నాయి. అలాగే కల్కి 2898 AD 44.39 కోట్లు, బాహుబలి 2 43 కోట్లు, గుంటూరు కారం 40.32 కోట్లతో టాప్ డే 1 ఓపెనింగ్స్ లిస్ట్‌లో ఉన్నాయి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ ఆ లిస్ట్‌ను రీ రైట్ చేసే అవకాశం ఉందా? అనేది ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ క్రేజ్, సోలో రిలీజ్, హైప్, మాస్ గ్యాంగ్‌స్టర్ డ్రామా కంటెంట్ అన్నీ కలిపి ఈ సినిమా 75 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సినిమా టాక్ ఎలా ఉంటుందన్నదే మొదటి రోజు తర్వాత కలెక్షన్లకు కీలకం అవుతుంది.
టాలీవుడ్ టాప్ డే 1 షేర్స్
RRR - 73.97Cr
పుష్ప 2 - 69.93Cr
దేవర - 61.65Cr
సలార్ - 47.60Cr
కల్కి 2898 AD - 44.39Cr
బాహుబలి 2 - 43Cr
గుంటూరు కారం - 40.32Cr
