తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఓపెనింగ్స్.. OG స్థానం ఎంతంటే?
హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని షాక్ ఇచ్చినప్పటికీ పవర్ స్టార్ మళ్ళీ OG సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
By: M Prashanth | 26 Sept 2025 3:16 PM ISTహరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని షాక్ ఇచ్చినప్పటికీ పవర్ స్టార్ మళ్ళీ OG సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఫ్యాన్స్ కి కావాల్సిన మూమెంట్స్ దొరకడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా విడుదలైన మొదటి రోజే పండుగ వాతావరణం నెలకొంది. ప్రీమియర్ల నుంచే పవన్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ సంగీతం హాళ్లను ఊపేసాయి. టాక్ మిక్స్‌డ్‌గా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం పూనకాలు తెచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నారు.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు భారీ స్థాయి కలెక్షన్లు రాబట్టింది. దసరా హాలిడే సీజన్ కలిసి రావడం, శుక్రవారం నుంచి వీకెండ్ ఎఫెక్ట్ ఉండటం వలన రాబోయే రోజుల్లో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశముందని అనలిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా నైజాం, సీడెడ్ ఏరియాల్లో పవన్ పవర్ మరోసారి బలంగా కనిపించింది.
ఇక తెలుగు రాష్ట్రాల డే వన్ షేర్స్‌ను పరిశీలిస్తే, ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఓజీ మొత్తం 62.35 కోట్ల షేర్ రాబట్టినట్లు టాక్. దీంతో ఓజీ అల్ టైమ్ టాప్ 3లోకి చేరింది. ఈ జాబితాలో ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన పెద్ద సినిమాలు ఉన్నా, పవన్ సినిమా కూడా వారితో సమానంగా నిలబడటం హైలైట్‌గా మారింది. ఫ్యాన్స్‌కు ఇది మరొక సంతోషకరమైన ఘట్టంగా చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు టాప్ కలెక్షన్లు అందుకున్న సినిమాలు (ట్రేడ్ అంచనాల ప్రకారం)
RRR: 73.97 కోట్లు
పుష్ప 2: 69.93 కోట్లు (ప్రీమియర్స్ + డే వన్)
ఓజీ: 62.35 కోట్లు (ప్రీమియర్స్ + డే వన్)
దేవర: 61.65 కోట్లు
సలార్: 47.60 కోట్లు
కల్కి 2898 AD: 44.39 కోట్లు
బాహుబలి 2: 43 కోట్లు
గుంటూరు కారం: 40.32 కోట్లు
ఈ లిస్ట్ చూస్తే, పవన్ పవర్ బాక్సాఫీస్ వద్ద ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. గతంలో వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల మధ్య ఓజీ టాప్ 3లో నిలవడం, పవన్ ఫ్యాన్స్‌కి గర్వకారణం. ముఖ్యంగా ఇది ఆయన స్టైల్ కి తగ్గ సినిమా కాబట్టి, ఇంకా ఎక్కువ క్రేజ్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద, ఓజీ తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఆరంభం ఇచ్చింది. టాక్ మిక్స్‌డ్‌గా ఉన్నప్పటికీ పవన్ ఎంట్రీ, యాక్షన్ సీన్స్, తమన్ బీజీఎం సినిమాకు బలంగా నిలిచాయి. దసరా సీజన్ కలసి రావడంతో రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి వీకెండ్ అనంతరం సినిమా కలెక్షన్స్ ఏ విదంగా ఉంటాయో చూడాలి.
