సినిమానే కాదు, కామిక్ బుక్ కూడా సూపర్‌హిట్టే!అసలు కథేంటంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ ఇయర్ తెలుగు హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఓజితో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Oct 2025 4:05 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ ఇయర్ తెలుగు హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఓజితో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. ఓజి యూనివర్స్ లో పలు సినిమాలొస్తాయని, వాటికి జపాన్ బ్యాక్ డ్రాప్ లో చాలా పెద్ద కథ ఉందని, సుభాష్ చంద్రబోస్ తో కూడా ఓజికి లింక్ ఉన్నట్టు డైరెక్టర్ సుజిత్ పలుమార్లు చెప్పారు. అయితే ఓజి యూనివర్స్ లో సినిమాల కంటే ముందు ఓ కామిక్ బుక్ రిలీజ్ చేస్తామని చెప్పగా, రీసెంట్ గా ఆ బుక్ రిలీజైంది. బుక్ రిలీజవగానే పవన్ ఫ్యాన్స్ దాన్ని ఆర్డర్ చేసుకోవాలని ఎంతో ఎగబడి మరీ బుక్ ను అందుకోగా, ఆ బుక్ తర్వాత రాబోయే సినిమాలపై భారీ ఆసక్తిని పెంచుతుంది.
ఈ బుక్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన కథగా రూపొందింది. ఇందులో పవన్ కళ్యాణ్ జై అనే పాత్రలో బ్రిటీష్ వాళ్ల తరపున పోరాడతారు. కానీ తమ ప్రజలను బ్రిటీషర్లు బంధీల్లా చూడటం చూసి తిరుగుబాటుదారుడిగా మారడం, గాయాలతో సముద్రంలో పడటం, షిండెన్ అనే జపనీస్ గ్రామం అతన్ని రక్షించడం, జై వద్ద హోంజో అనే భారీ చరిత్ర ఉన్న ఓ కటానా ఉండటం, ఆ కటానా అక్కడికి వచ్చిందని తెలిసి దాని కోసం బ్లాక్ డ్రాగన్స్ షిన్‌డెన్ మీద యుద్ధానికి రావడం జరుగుతాయి. గాయపడి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న జై తనను కాపాడిన షిన్‌డెన్ కోసం ఆ కటానాతో బ్లాక్ డ్రాగన్స్ ను అంతమొందిస్తారు.
యుద్ధం టైమ్ లో అక్కడ తన వంతు సేవలు అందించడానికి వచ్చిన ఓ జపాన్ నర్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న జై కు తర్వాత సుభాష్ చంద్రబోస్ నుంచి పిలుపు రావడం, ఆయన భార్యను వదిలేసి వెళ్లడం, అతని భార్య ఓ పిల్లాడికి జన్మనిచ్చి చనిపోవడం, ఆ బిడ్డే గంభీర అవడం ఇవన్నీ కామిక్ బుక్ లో పవర్‌ఫుల్ ఫోటోలతో అర్థమయ్యేలా చేశారు.
అయితే ఈ రెండు ప్రపంచాలను కామిక్ ఎలా కలుపుతుందనేది చూడ్డానికి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓజి కామిక్ బుక్ రిలీజయ్యాక ఓజి యూనివర్స్ లో రానున్న సినిమా ఎలా ఉంటుందో ఊహిస్తూ ఎవరికి వారే కథలు అల్లేస్తున్నారు. ఏదేమైనా గంభీర తండ్రి పాత్రలో కూడా పవన్ కళ్యాణే నటించనున్నారని ఈ బుక్ తో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. తర్వాతి సినిమాల్లో జై, గంభీర కలుస్తారా లేదా అనేది సస్పెన్స్ మారింది. మొత్తానికి ఓజి సినిమాతోనే కాదు, కామిక్ బుక్ తో కూడా అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
