ఆస్ట్రేలియాలో OG గట్టిగానే స్టార్ట్ చేసింది.. కానీ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కడ రిలీజ్ అయినా అభిమానుల క్రేజ్ మామూలుగా ఉండదు.
By: M Prashanth | 26 Sept 2025 4:39 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కడ రిలీజ్ అయినా అభిమానుల క్రేజ్ మామూలుగా ఉండదు. తాజాగా వచ్చిన OG కూడా అదే స్థాయిలో హై వోల్టేజ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ సినిమా బలమైన ఓపెనింగ్స్ సాధిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఈ సినిమాకు వచ్చిన స్పందన ట్రేడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఓజీ ఆస్ట్రేలియాలో మొదటి రోజే 3.32 లక్షల డాలర్ల వసూళ్లు సాధించింది. ఈ సంఖ్యతో టాప్ 10 డే వన్ గ్రాస్ జాబితాలో చోటు సంపాదించుకుంది. అక్కడి మార్కెట్లో తెలుగు సినిమాలు గతంలోనూ మంచి ఫలితాలు సాధించాయి. ఇప్పుడు ఆ జాబితాలో పవన్ కళ్యాణ్ సినిమా కూడా తన స్థానాన్ని దక్కించుకోవడం ఆయన మార్కెట్ స్థాయిని మరోసారి చూపించింది.
కానీ ఈ లిస్ట్‌లో OG టాప్ 5లో నిలవలేకపోయింది. అగ్రస్థానంలో బాహుబలి 2 ఉంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆస్ట్రేలియాలో మొదటి రోజే 8.25 లక్షల డాలర్ల గ్రాస్ సాధించి రికార్డు సృష్టించింది. తర్వాత స్థానంలో RRR 7.02 లక్షల డాలర్లతో కొనసాగుతోంది. పుష్ప 2 కూడా 6.53 లక్షల డాలర్లతో టాప్ 3లో ఉంది.
ఆస్ట్రేలియాలో మొదటిరోజు టాప్ 10 గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు (ట్రేడ్ అంచనాల ప్రకారం)
బాహుబలి 2: A$825K
RRR: A$702K
పుష్ప 2: A$653K
దేవర: A$470K
కల్కి 2898 ఏడీ: A$469K
సలార్: A$453K
సాహో: A$365K
ఓజీ: A$332K
ఆదిపురుష్: A$320K
అల.. వైకుంఠపురములో: A$257K
సరిలేరు నీకెవ్వరు: A$237K
ఈ లిస్ట్ చూస్తే, గత కొన్ని ఏళ్లలో తెలుగు సినిమాలు ఆస్ట్రేలియా మార్కెట్లో ఎంత బలమైన స్థానం సంపాదించుకున్నాయో స్పష్టమవుతుంది. రాజమౌళి, ప్రభాస్ సినిమాలు అక్కడ బాక్సాఫీస్ వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఆ జాబితాలో నిలవడం పవన్ మాస్ పవర్ ఓవర్సీస్‌లో ఎంత గట్టిగా ఉందో మరోసారి రుజువైంది. మొత్తం మీద ఓజీ మొదటి రోజే ఆస్ట్రేలియాలో రికార్డు లెవెల్ కలెక్షన్లు సాధించడం సినిమా కోసం ఒక బలమైన స్టార్ట్ అని చెప్పొచ్చు. టాక్ మిక్స్‌డ్ ఉన్నప్పటికీ పవన్ ఎంట్రీ, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాయి. ఇక మిగిలిన రోజుల్లో లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి.
