పన్నెండేళ్ల తర్వాత... పవర్ స్టార్ కి క్లీన్ హిట్!
నిజానికి ఇది కేవలం ఒక హిట్ మాత్రమే కాదు, పవన్ కెరీర్ కి ఒక బిగ్ హిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, 12 ఏళ్ల తర్వాత పవన్ ఖాతాలో చేరిన మొట్టమొదటి క్లీన్ హిట్ ఇది.
By: M Prashanth | 8 Oct 2025 10:01 AM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ OG బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ జోరు చూపిన ఓజాస్ గంభీర ఆ తరువాత మళ్ళీ స్లో అయ్యింది. కానీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సపోర్ట్ తో రెండో వీకెండ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని.. 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంది.
నిజానికి ఇది కేవలం ఒక హిట్ మాత్రమే కాదు, పవన్ కెరీర్ కి ఒక బిగ్ హిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, 12 ఏళ్ల తర్వాత పవన్ ఖాతాలో చేరిన మొట్టమొదటి క్లీన్ హిట్ ఇది. 2013లో వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన పవన్ కల్యాణ్ ఆ తరువాత డిజాస్టర్స్ బిలో యావరేజ్, యావరేజ్ సినిమాలతోనే సరిపెట్టాడు..
ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఓవరాల్ గా నిర్మాతకు లాభాలు ఇచ్చినా ఎక్కడో ఒక ఏరియాలో బయ్యర్స్ లాసెస్ చూడక తప్పలేదు. అనుకున్న బ్రేక్ ఈవెన్ ను సాధించలేదు. ఇక ఆ విధంగా చూస్తే OG మాత్రం దాదాపు సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ వాల్యూ దాదాపు 172.50 కోట్లుగా లెక్క కట్టారు. అంటే, క్లీన్ హిట్ కావడానికి 174 కోట్ల మార్కును చేరుకోవాలి. రెండో వీకెండ్ ముగిసే నాటికి ఈ సినిమా 175 కోట్ల రేంజ్‌లో షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
వర్కింగ్ డేస్‌లోనూ తగ్గేదేలే అన్నట్టుగా, 12వ రోజున కూడా 20,000కు పైగా టికెట్ సేల్స్‌ను నమోదు చేసి, మొత్తానికి టార్గెట్‌ను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విజయం వచ్చినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'ఓజీ' ఇంకా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సిన అవసరం కనిపిస్తోంది.
కానీ, సినిమా వసూళ్లు స్థిరంగా కొనసాగుతూ, లిమిటెడ్ డ్రాప్స్ చూపిస్తుండడం ట్రేడ్ పండితులకు ఆశనిస్తోంది. లాంగ్ రన్‌లో ఈ స్టడీ పరుగు కంటిన్యూ అయితే, తెలుగు రాష్ట్రాల టార్గెట్‌ను కూడా త్వరలోనే చేరుకునే అవకాశం ఉంది. మొదటి 12 రోజుల్లో 'ఓజీ' టోటల్ 174.25 కోట్ల షేర్‌తో తన సత్తా చూపిందని అంచనా. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఏకంగా 50.20 కోట్ల మార్క్ ను దాటింది. ఓవర్సీస్‌లో కూడా 31.80 కోట్ల అద్భుతమైన వసూళ్లతో పవన్ క్రేజ్‌ను నిరూపించుకుంది.
అంచనాల ప్రకారం 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల ఏరియాల వారీ కలెక్షన్స్ (షేర్) వివరాలు ఇక్కడ ఉన్నాయి:
నైజాం: 50.20 కోట్లు
సీడెడ్: 17.32 కోట్లు
ఉత్తరాంధ్ర: 15.86 కోట్లు
తూర్పు గోదావరి: 11.99 కోట్లు
పశ్చిమ గోదావరి: 8.06 కోట్లు
గుంటూరు: 10.78 కోట్లు
కృష్ణా: 9.45 కోట్లు
నెల్లూరు: 4.56 కోట్లు
మొత్తం (తెలుగు రాష్ట్రాలు): 128.22 కోట్లు (అంచనా)
ఓవరాల్‌గా 12 రోజులకుగానూ 0.25 కోట్ల లాభంతో ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలిచింది. ఈ స్టడీ కలెక్షన్స్ చూస్తుంటే, రాబోయే మూడో వీకెండ్‌లో 'ఓజీ' కనీసం 2 నుంచి 3 కోట్ల మధ్య షేర్‌ను తేగలిగితే, డిస్ట్రిబ్యూటర్లకు డీసెంట్ లాభాలు రావడం ఖాయం. పవర్ స్టార్ పన్నెండేళ్ల తర్వాత సాధించిన ఈ విజయం, ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
