OG బజ్ తగ్గిందా?
తర్వాత శుక్రవారం కూడా అలరించారు. కానీ శనివారం నుంచి పోస్ట్ ప్రమోషన్స్ తగ్గించేశారు. దీంతో వీకెండ్ తో ఆడియన్స్ లో పెరగాల్సిన బజ్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది.
By: M Prashanth | 28 Sept 2025 7:00 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో రూపొందిన ఓజీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తన కుమారుడు కళ్యాణ్ తో కలిసి సీనియర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు.
ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఓజీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్ సహా అనేక నటీనటులు యాక్ట్ చేయగా.. సినిమా సందడి బుధవారం రాత్రి ప్రీమియర్స్ తో స్టార్ట్ అయింది. గురువారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజైంది.
ఇప్పటి వరకు మూడు రోజుల థియేట్రికల్ రన్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఓజీ మూవీ.. అంచనాల ప్రకారం రూ.210 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియర్స్ తో కలిపి ఓపెనింగ్స్ రూ.154 కోట్లు రాగా.. రెండో రోజు, మూడో రోజు కలిపి రూ.56 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు వీకెండ్ కావడంతో వసూళ్లు భారీగా ఉండనున్నట్లు వినికిడి.
వసూళ్ళ పరంగా ఓకే అయినా.. ఇప్పుడు సినిమాపై ఆడియన్స్ లో బజ్ తగ్గిందని సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అది కూడా మేకర్స్ వల్లేనని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. బుధవారం ప్రీమియర్స్.. గురువారం రిలీజ్.. ఫస్ట్ రెండు రోజులు పోస్ట్ ప్రమోషన్స్ తో సందడి చేశారు మేకర్స్.
ఆ తర్వాత శుక్రవారం కూడా అలరించారు. కానీ శనివారం నుంచి పోస్ట్ ప్రమోషన్స్ తగ్గించేశారు. దీంతో వీకెండ్ తో ఆడియన్స్ లో పెరగాల్సిన బజ్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. నిజానికి ఓజీ మూవీ.. ఈ మధ్య కాలంలో నెవ్వర్ బిఫోర్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. భారీ హైప్ తో విడుదలైంది.
కానీ దాన్ని కంటిన్యూ చేయడంలో మేకర్స్ స్లో అయ్యారా అనే డౌట్ కలుగుతుంది. వసూళ్ళ పరంగా ఓకే అయినా.. బజ్ పరంగా ఇంకాస్త సక్సెస్ అయ్యి ఉంటే కలెక్షన్లు ఇంకా పెరుగుతాయని చెబుతున్నారు. ఇప్పుడు వచ్చిన వాటి కన్నా కచ్చితంగా ఎక్కువ వస్తాయని అంటున్నారు. ఏదేమైనా ఫ్యాన్స్ లో ఉన్న భారీ ఫాలోయింగ్ ను యూజ్ చేసుకోకపోవడం వల్ల బజ్ తగ్గిందనే కామెంట్స్ ఎక్కువయ్యాయి. దీంతో మేకర్స్ అలర్ట్ ఏమైనా అవుతారేమో చూడాలి.
