Begin typing your search above and press return to search.

రెండవ వారం టాప్ షేర్ మూవీస్.. OG ఎంత అందుకుందంటే?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ (They Call Him OG) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   9 Oct 2025 8:41 PM IST
రెండవ వారం టాప్ షేర్ మూవీస్.. OG ఎంత అందుకుందంటే?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ (They Call Him OG) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ దాసరి గ్రాండ్ గా నిర్మించారు.

సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్, శ్రియా రెడ్డి, సుధేవ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. తమన్ మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ 25వ తేదీన సినిమా పెద్ద ఎత్తున రిలీజైంది.

ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఓజీ మూవీ.. మిగతా మూవీ లవర్స్ ను కంప్లీట్ గా సాటిస్ఫై చేయలేకపోయింది. కానీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా.. ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు రూ.317 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

అయితే రెండు వారాల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకున్న ఓజీ మూవీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన షేర్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.17.3 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. తద్వారా రెండో వారం టాప్ షేర్లు సాధించిన సినిమా లిస్ట్ లో 15వ స్థానంలో నిలిచింది. మరి తెలుగు రాష్ట్రాల్లో రెండో వారం టాప్ షేర్లు రాబట్టిన మూవీల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ - రూ.61.11 కోట్లు

బాహుబలి 2 - రూ.40.28 కోట్లు

పుష్ప 2 ది రూల్- రూ.35.64 కోట్లు

కల్కి 2898 ఏడీ- రూ.31.75 కోట్లు

సంక్రాంతికి వస్తున్నాం- రూ.27.97 కోట్లు

హనుమాన్- రూ.27.00 కోట్లు

బాహుబలి - రూ.26 కోట్లు (దగ్గరగా)

అల వైకుంఠపురములో- రూ.25.52 కోట్లు

వాల్తేరు వీరయ్య- రూ.24.03 కోట్లు

సరిలేరు నీకెవ్వరు- రూ.21.80 కోట్లు

దేవర- రూ.21.26 కోట్లు

సలార్- రూ.18.88 కోట్లు

సైరా నరసింహారెడ్డి - రూ.18.66 కోట్లు

ఎఫ్ 2 - రూ.17.69 కోట్లు

ఓజీ- రూ.17.3 కోట్లు

రంగస్థలం- రూ.14.52 కోట్లు