‘ఓజీ’ని ట్రోల్ చేశారు.. చివరికి చూస్తే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక హైప్‌తో వచ్చిన సినిమాగా ‘ఓజీ’ని చెప్పొచ్చు. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు.
By: Garuda Media | 6 Oct 2025 5:52 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక హైప్‌తో వచ్చిన సినిమాగా ‘ఓజీ’ని చెప్పొచ్చు. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయినా హైప్ ఏమీ తగ్గలేదు. బయ్యర్లు ఫ్యాన్సీ రేట్లు పెట్టి సినిమాను కొన్నారు. పెయిడ్ ప్రిమియర్స్‌కు వచ్చిన స్పందన.. తొలి రోజు, వీకెండ్లో వచ్చిన వసూళ్లు చూసి అందరూ చాలా ఖుషీ అయ్యారు. కానీ వీకెండ్ తర్వాత సినిమా బాగా స్లో అయిపోయింది. అప్పటికి బయ్యర్లు సేఫ్ జోన్లోకి రాలేదు. రికవరీ ఎక్కడా 80 శాతానికి మించలేదు. ఏరియాలను బట్టి ‘ఓజీ’ 60-80 శాతం మధ్య రికవర్ చేయగలిగింది అంతే. సోమవారం ఒక్కసారిగా వసూళ్లు డ్రాప్ కావడంతో బయ్యర్లలో ఆందోళన తప్పలేదు. మంగళ, బుధవారాల్లో నామమాత్రంగా షేర్ రావడంతో సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ తప్పలేదు.
ఇంత హైప్ తెచ్చుకుని, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాతో కూడా పవన్ కళ్యాణ్ నష్టాలు తెచ్చిపెడుతున్నాడని.. ఓపెనింగ్స్ హంగామా తప్పితే, తన సినిమాలకు లాంగ్ రన్ ఉండట్లేదని ఎద్దేవా చేశారు వేరే హీరోల ఫ్యాన్స్. ఇది పవన్ అభిమానులకు కూడా కొంచెం ఇబ్బందిగానే కనిపించింది. దసరా వీకెండ్లో ‘కాంతార’ లాంటి క్రేజీ మూవీ రావడంతో ‘ఓజీ’ ఇక నిలబడడం కష్టమేనేమో అనుకున్నారంతా. కానీ రెండో వీకెండ్లో ‘ఓజీ’ బలంగా నిలబడింది. గురువారం దసరా రోజు, ఆ తర్వాత వీకెండ్లో సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు పడ్డాయి. తెలంగాణలో మంగళవారం నుంచి టికెట్ల రేట్లు తగ్గించడం గురువారం నుంచి ప్లస్ అయింది. ఏపీలో కూడా ఆదివారం నాటికి రేట్లు తగ్గిపోయాయి.
ఇది ‘ఓజీ’ లాంగ్ రన్‌కు ఉపయోగపడుతోంది. ఒక దశలో ‘ఓజీ’ పనైపోయింది అనుకున్నారు కానీ.. సినిమా మళ్లీ పుంజుకునేసరికి ఇటు బయ్యర్లు, అటు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తొలి వీకెండ్ వరకు ఫ్యాన్స్ సినిమాను భుజాలపై మోస్తే.. ఇప్పుడు న్యూట్రల్ ఆడియన్స్, కుటుంబ ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతోంది. ఈ వీకెండ్ కూడా సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బయ్యర్లందరూ బ్రేక్ ఈవెన్‌కు చేరువగా ఉన్నారు. నైజాంలో ఆల్రెడీ 100 పర్సంట్ రికవరీ అయినట్లే కనిపిస్తోంది. ఫుల్ రన్లో బయ్యర్లందరూ కొంతమేర లాభాలు అందుకునే అవకాశముంది.
