Begin typing your search above and press return to search.

USలో ఆ మార్క్ అందుకున్న OG.. 6వ రోజు లెక్కలు ఇలా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఓజీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   1 Oct 2025 12:34 PM IST
USలో ఆ మార్క్ అందుకున్న OG.. 6వ రోజు లెక్కలు ఇలా!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఓజీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

అయితే ఓవర్సీస్ లో ఓజీ.. రిలీజ్ కు ముందే భారీ రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రీమియర్స్ తో మూడు మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. దీంతో ఫస్ట్ వీకెండ్ కల్లా సినిమా 5 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలా జరగలేదు. ఫస్ట్ వీకెండ్ లో ఆ ఫీట్ టచ్ చేయలేదు.

ఇప్పుడు ఓజీ మూవీ.. నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్ధ ప్రత్యంగిరా సినిమాస్ వెల్లడించింది. ఓజీ తుపాను.. ఉత్తర అమెరికాలో $5.2M+ను దాటేసిందని చెప్పింది. దాంతోపాటు సినిమాలో పవన్ కు సంబంధించిన పోజును అదిరిపోయే పోస్టర్ రూపంలో రిలీజ్ చేసింది.

అదే సమయంలో నైజాంలో ఓజీ మూవీ.. ఆరో రోజు (సెప్టెంబర్ 30)న రూ.2.42 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తద్వారా నైజాంలో ఆరో రోజు అత్యధిక షేర్ రాబట్టిన సినిమాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉంది. మరి నైజాంలో ఆరో రోజు అత్యధిక షేర్ రాబట్టిన సినిమాల వివరాలు ఇలా!

ఆర్ఆర్ఆర్- రూ.4.80 కోట్లు

కల్కి 2898 AD - రూ.4.36 కోట్లు

దేవర - రూ.4.30 కోట్లు

పుష్ప 2 - రూ.4.05 కోట్లు

సలార్ - రూ. 2.42Cr

ఇక ఓజీ సినిమా విషయానికొస్తే.. సుజీత్ దర్శకత్వం వహించిన సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందించారు. సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించారు. అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, సుధేవ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఫుల్ రన్ లో ఓజీ ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాలి.