OG: మనవడి హ్యాపీనెస్ తో నాగబాబు హై వోల్టేజ్ ఎలివేషన్!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
By: M Prashanth | 26 Sept 2025 8:28 PM ISTపవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా అభిమానులలో ఒక సెలబ్రేషన్ వైబ్ ఉంటుంది. లేటెస్ట్ గా విడుదలైన ఓజీ కూడా అదే తరహాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రోజునుంచే థియేటర్ల వద్ద హంగామా మొదలైంది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు వస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. ఇప్పటికే లెక్క 154 కోట్లకు చేరిందని మేకర్స్ ఓ పోస్టర్ కూడా వదిలారు.
సినిమాపై వచ్చిన మిక్స్ డ్ టాక్ కంటే ఎక్కువగా పవన్ స్టైల్, యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్‌కి కనెక్ట్ అయ్యాయి. ఈ క్రేజ్‌కి తోడు సోషల్ మీడియాలోనూ అభిమానులు సెలబ్రేషన్స్ కొనసాగిస్తున్నారు. అలాంటి సమయంలో పవన్ అన్న నాగబాబు చేసిన పోస్ట్ మరోసారి ఫ్యాన్స్‌లో ఎనర్జీ పెంచింది.
నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ ఫొటో షేర్ చేస్తూ, కవితాత్మకంగా తన భావాలను వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి ఒక టైమ్ వస్తుంది. ఆ సమయంలో కృషి, అదృష్టం కలిసొస్తాయి. అదే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి వచ్చింది. పవన్ కళ్యాణ్ కష్టపడిన విధానం, ఆయన నాయకత్వం ఇప్పుడు ఓజీ సినిమా రూపంలో ఫలితాన్ని ఇచ్చాయి. ఆయన కృషి, హృదయం గొప్పవి అని నాగబాబు చెప్పారు.
అలాగే నాగబాబు తన మనవడి గురించి కూడా చెప్పారు. "అతని అమాయకమైన చిరునవ్వు మన కుటుంబానికి కొత్త వెలుగు తీసుకొచ్చింది" అని చెప్పారు. అంటే మెగా ఫ్యామిలీలో కొత్త తరం రావడం కూడా ఒక శుభ సంకేతం అని భావించారు. అలాగే అన్నయ్య చిరంజీవి పేరు ప్రస్తావిస్తూ, ఆయననే మార్గదర్శక దీపమని చెప్పారు. అలాగే చరణ్, తేజ్, వైష్ణవ్, వరుణ్ వంటి యువ హీరోలను కూడా ప్రస్తావిస్తూ, మన కుటుంబం ఒక పెద్ద శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. ఈ బంధం, ఈ వారసత్వం ఎప్పటికీ కొనసాగుతుందని చెబుతున్నారు.
"ఓజీ ఇప్పుడు సూపర్ హిట్ మంటలా దహించుకుంటోంది" అని చెప్పారు. ఈ సినిమా వల్ల పవన్‌కి వచ్చిన ర్యాంపేజ్‌ని ఒక సెలబ్రేషన్‌గా వర్ణించారు. ప్రతి షాట్, ప్రతి సీన్ అభిమానుల కోసం ఒక పండుగలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దర్శకుడు సుజీత్‌ను “ట్రూ ఫ్యాన్‌బాయ్” అని పొగిడారు. ఆయన చేసిన డైరెక్షన్ వల్ల పవన్ కల్యాణ్‌ను కొత్తగా చూపించారని అన్నారు.
తమన్ సంగీతం, రీ రికార్డింగ్ గురించి “గూస్‌బంప్స్ ఇచ్చే స్థాయిలో ఉంది” అని పేర్కొన్నారు. సినిమాటోగ్రాఫర్లు రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస తీసిన ఫ్రేమ్స్ గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు. నిర్మాతలు దానయ్య, కల్యాణ్ దాసరిలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మొత్తం టెక్నీషియన్లకు, నటీనటులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. “ఈ సినిమా అందరి కష్టానికి ప్రతిఫలం, అందరూ కలిసి పవర్, గ్రేస్ జోడించారు” అని నాగబాబు పేర్కొన్నారు.
