పవన్ స్పీడు మామూలుగా లేదుగా!
ఓ వైపు ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తూ చాలా బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
By: Sravani Lakshmi Srungarapu | 12 Sept 2025 3:00 AM ISTఓ వైపు ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తూ చాలా బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే రీసెంట్ గా హరి హర వీరమల్లు సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసిన పవన్ ఆ సినిమాతో అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయారు. వీరమల్లు తర్వాత ఓజి సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు పవన్.
రెండోసారి హరీష్ శంకర్ తో పవన్
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజి సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఓజి సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది.
అనుకోకుండా గ్యాప్
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవాల్సింది కానీ పవన్ మధ్యలో పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో పాటూ ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాల్సి రావడంతో ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ ఆగిపోయింది. అన్ని కమిట్‌మెంట్స్ ను పూర్తి చేసుకుని ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించే సరికి అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువగానే ఆలస్యం జరిగింది.
కాగా ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పవన్ ఈ సినిమాకు వరుస డేట్స్ ఇవ్వడంతో హరీష్ ఈ సినిమాను పరుగులు పెట్టిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలో పవన్ పోర్షన్ షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని సమాచారం. సెప్టెంబర్ 13తో పవన్ పోర్షన్ షూటింగ్ మొత్తం ఫినిష్ అవుతుందని తెలుస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఉస్తాద్ భగత్‌సింగ్ తర్వాత పవన్ కొత్త సినిమాలు చేస్తారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
