పవర్ స్టార్ తో ఈసారి 500 కోట్లు పక్కా!
ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
By: Srikanth Kontham | 30 Aug 2025 3:27 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంత వరకూ 500 కోట్ల క్లబ్ లో చేరలేదు. సహచరులంతా పాన్ ఇండియాలో దూసుకుపోతుంటే పవన్ మాత్రం చాలా వెనుకబడ్డారు. ఇప్పటికే రామ్ చరణ్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి వారు 500 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `హరిహరవీ రమల్లు`తో అది సాధ్యమవుతుందనుకున్నా? పనవ్వలేదు. దీంతో ఇప్పుడు ఆశలన్నీ `ఓజీ`పైనే ఉన్నా యి. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న `ఓజీ`పై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తోన్న చిత్రమిది.
పవన్ రేంజ్ మార్చే చిత్రం:
ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. పవన్ లుక్...సుజిత్ యాక్షన్ మేకింగ్ వంటి అంశాలు సినిమాను పతాక స్థాయిలో నిలబెట్టాయి. సినిమా గురించి ప్రీ టాక్ కూడా బలంగానే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 500 కోట్ల మార్క్ ను ఈజీగా దాటుతుందని అభిమానులు సహా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తు న్నాయి. `ఓజీ` అనంతరం పవన్ రేంజ్ మారిపోతుందనే డిస్కషన్ ప్రతీచోటా జరుగుతోంది.
అభిమానులు ఎంతో ఆశగా:
పవన్ కూడా సక్సెస్ కోసం అంతే ఆశగా ఎదురు చూస్తున్నారు. 'అత్తారింటికి దారేది' తర్వాత పీకే కి సాలిడ్ హిట్ పడలేదు. `సర్దార్ గబ్బర్ సింగ్`, 'కాటమరాయుడు', 'అజ్ఞాత వాసి', 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', వీరమల్లు లో ఏదీ అనుకున్న సక్సస్ తీసుకురాలేదు. ఏవీ పవన్ రేంజ్ హిట్ చిత్రాలు కాదు. దీంతో పవన్ అభిమానులు సక్సెస్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తోటి హీరోలంతా 500 కోట్లు..1000 కోట్లు అంటూ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ రేంజ్ కి వెళ్లిపోతుంటే అన్న మాత్రం వెనుకబడ్డారనే బాధ నిద్రపోనివ్వడం లేదు.
`ఓజీ`తో రికార్డులు తారుమారేనా:
దీంతో 'ఓజీ' బ్లాక్ బస్టర్ అవుతుందని...500కోట్లు కొల్లగొడుతుందని..మళ్లీ కాల రెగరేసి తిరుగుతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పీకే కెరీర్ లో కల్ట్ హిట్ 'ఓజీ'తో పడుతుందని ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. పైగా పోటీలో ఉన్న నటసింహ బాలకృష్ణ కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. `అఖండ 2` అనూహ్యంగా వాయిదా పడటంతో? అది కూడా ఓజీకి కలిసొచ్చే అంశంగా ట్రేడ్ అంచనా వేస్తుంది. మరేం జరుగుతుం దన్నది తెలియాలంటే సెప్టంబర్ 25వరకూ ఎదురు చూడాల్సిందే.
