నైజాంలో పవన్ కళ్యాణ్ ఓజి ఊచకోత
తెలుగు సినిమా వరకు నైజాం అతి పెద్ద బిజినెస్ ఏరియా అని చెప్పొచ్చు. నైజాంలో కూడా ఎక్కువ బిజినెస్ హైదరాబాద్ లోనే జరుగుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 8 Oct 2025 11:42 AM ISTతెలుగు సినిమా వరకు నైజాం అతి పెద్ద బిజినెస్ ఏరియా అని చెప్పొచ్చు. నైజాంలో కూడా ఎక్కువ బిజినెస్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. టాలీవుడ్ లోని ఎంతో మంది స్టార్ హీరోలకు నైజాం కంచుకోట లాంటిది. నైజాంలో ఇప్పటికే పలు సినిమాలు రూ.50 కోట్ల క్లబ్ లో చేరగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా కూడా ఆ లిస్ట్ లోకి చేరింది.
టాలీవుడ్ కు కంచుకోటగా నైజాం ఏరియా
నైజాం ఏరియా మార్కెట్ క్రమంగా పెరుగుతూ ఉండగా, ఇటీవల కాలంలో ఇక్కడ కొన్ని సినిమాలు రూ.50 కోట్ల వసూళ్ల మార్క్ ను అందుకుని రచ్చ చేస్తున్నాయి. నైజాంలో 2017వ సంవత్సరంలో మొట్టమొదటిగా బాహుబలి2 సినిమా రూ.50 కోట్ల మార్క్ ను దాటి రికార్డు సృష్టించగా, ఆ తర్వాత రికార్డు బ్రేక్ అవడానికి ఏడేళ్లు పట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసింది.
మూడు రూ.50 కోట్ల సినిమాలతో ప్రభాస్
ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా, కల్కి 2898AD సినిమాలు ఈ మార్క్ ను అందుకోగా గతేడాది ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమా కూడా ఈ క్లబ్ లోకి చేరింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప2 సినిమా కూడా ఈ క్లబ్ లో చేరగా, ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన దే కాల్ హిమ్ ఓజి సినిమా రూ.50 కోట్ల క్లబ్ లోకి జాయినైంది.
పవన్ కు ఇదే తొలిసారి
పవన్ కళ్యాణ్ కు సరైన సినిమా పడితే దాని తాలూకా రిజల్ట్ ఎలా ఉంటుందో ఓజి సినిమా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఫస్ట్ షో నుంచే ఓజికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నైజాంలో రూ.50 కోట్ల క్లబ్ లోకి చేరిన 7వ సినిమాగా రికార్డు సృష్టించింది. పవన్ కళ్యాణ్ నైజాంలో ఈ రికార్డు అందుకోవడం ఇదే మొదటిసారి కాగా ప్రభాస్ కు మూడుసార్లు ఈ ఘనతను అందుకున్నారు.
