Begin typing your search above and press return to search.

ఆ లిస్ట్ లో 6వ స్థానంలో OG..!

పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ ఎమోషనల్ అవ్వడం చూసి ఆయన కూడా ఫీల్ అయ్యారు. ఓజీ యూనివర్స్ కి పవన్ కళ్యాణ్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

By:  Ramesh Boddu   |   8 Oct 2025 10:00 AM IST
ఆ లిస్ట్ లో 6వ స్థానంలో OG..!
X

పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఫ్యాన్స్ ఫీస్ట్ మూవీగా వచ్చి సక్సెస్ అందుకుంది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఓజీ సినిమా చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఇది కదా కావాల్సింది అనుకున్నారు. సినిమా చూస్తున్నంతసేపు ఫ్యాన్స్ అంతా కూడా ఒక డిఫరెంట్ వైబ్ లో పవన్ కళ్యాణ్ వింటేజ్ డేస్ గుర్తు చేసేలా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ ఎమోషనల్ అవ్వడం చూసి ఆయన కూడా ఫీల్ అయ్యారు. ఓజీ యూనివర్స్ కి పవన్ కళ్యాణ్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సుజిత్ కథ ఎంత బలంగా రాసుకుంటాడు అన్నది చూడాలి.

పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా..

ఐతే ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజై 300 కోట్ల గ్రాస్ దాటేసింది. ఈ సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా సూపర్ అనేశారు. ఐతే ఈ సినిమాకు సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. మామూలుగా అయితే ఇప్పటివరకు యు/ఏ సినిమాలే బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టాయి. ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న సినిమాలు 300 కోట్లు దాటినవి చాలా తక్కువ ఉన్నాయి.

ఇప్పుడు ఆ లిస్ట్ లో ఓజీ కూడా చేరింది. ఏ సర్టిఫికెట్ అందుకుని 300 కోట్లు కలెక్షన్స్ దాటిన సినిమాల్లో ఓజీ ఆరవ ప్లేస్ లో ఉంది. అంతకుముందు ఐదు సినిమాలు ఇలానే A సర్టిఫికెట్ తెచ్చుకుని 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాయి. U/A సర్టిఫికెట్ తో 1000 కోట్లు దాటిన సినిమాలు కూడా ఉన్నాయి. కేవలం A సర్టిఫికెట్ తెచ్చుకుని కేవలం ఐదారు సినిమాలే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టాయి.

A సర్టిఫికెట్ అంటే ప్యూర్లీ అడల్ట్ అని..

ఒకప్పుడు A సర్టిఫికెట్ అంటే ప్యూర్లీ అడల్ట్ అని ఫిక్స్ అయ్యే వారు. కానీ ఈమధ్య శృతిమించిన వైలెన్స్ తో అడల్ట్స్ ఓన్లీ అని సర్టిఫికెట్ వచ్చినా అందరు చూసేస్తున్నారు. U/A ఇచ్చిన సినిమాకు ఈక్వెల్ గా ఏ సర్టిఫికెట్ సినిమాలు ఆడేస్తున్నాయి. ఓజీ సినిమాకు యు/ఏ కోసం ట్రై చేసి ఉండాల్సింది. అలా చేసి ఉంటే కేవలం అడల్ట్స్ మాత్రమే కాకుండా మిగతా ఆడియన్స్ కూడా వచ్చి చూసే వాళ్లు.

OG సినిమాతో సుజిత్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు. నెక్స్ట్ సుజిత్ నానితో ఒక క్రేజీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైతే OGకి దాన్ని రిలేట్ చేస్తే అదిరిపోతుందని అంటున్నారు ఆడియన్స్.