Begin typing your search above and press return to search.

పదేళ్ల క్రితం ప్రభాస్.. ఇప్పుడు పవన్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   2 Oct 2025 2:04 PM IST
పదేళ్ల క్రితం ప్రభాస్.. ఇప్పుడు పవన్..
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మిగతా మూవీ లవర్స్ ను కాస్త అప్సెట్ చేసినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

సెప్టెంబర్ 25వ తేదీన సినిమా రిలీజ్ అవ్వగా, ముందు రోజు ప్రీమియర్స్ పడ్డాయి. తద్వారా సినిమా ఓపెనింగ్స్ రూ.154 కోట్లకు పైగా సాధించి అదరగొట్టింది. ఫస్ట్‌ డే అత్యధిక వసూలు చేసిన టాప్‌-10 భారతీయ సినిమాల జాబితాలో ప్లేస్ సంపాదించుకుంది. అంతే కాదు.. టాలీవుడ్ నుంచి ఏడో సినిమాగా నిలిచింది.

ఆ తర్వాత నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.252+ కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిన సినిమా.. ఇప్పుడు రూ.300 కోట్లకు చేరువలో ఉంది. అయితే టాలీవుడ్ లో రూ.250 కోట్ల గ్రాసర్స్ లిస్ట్ లో 14వ చిత్రంగా నిలిచింది. 2025 ఏడాదిలో సంక్రాంతికి వస్తున్నాం తర్వాత రెండో సినిమాగా ఉంది.

అయితే టాలీవుడ్ రూ.250 కోట్ల గ్రాసర్స్ జాబితాలో తొలిసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అడుగుపెట్టారు. ఆయన లీడ్ రోల్ లో నటించిన బాహుబలి-1 మూవీ.. 2015లో ఆ మార్క్ అందుకుంది. అదే సమయంలో ఇప్పటివరకు ప్రభాస్ నటించిన.. ఆరు సినిమాలు రూ.250 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టడం గమనార్హం. మరి ఆ లిస్ట్ లో ఇంకా ఏ హీరోలు ఉన్నారు? ఏ సినిమాలు ఉన్నాయి?

1. ప్రభాస్ - బాహుబలి-1 (2015)

2. ప్రభాస్- బాహుబలి-2 (2017)

3. ప్రభాస్- సాహో (2019)

4. అల్లు అర్జున్- అలా వైకుంఠపురంలో(2021)

5. అల్లు అర్జున్- పుష్ప-1 (2021)

6. చరణ్, జూనియర్ ఎన్టీఆర్- ఆర్ఆర్ఆర్(2022)

7. ప్రభాస్- ఆదిపురుష్ (2022)

8. ప్రభాస్- సలార్ (2023)

9. జూనియర్ ఎన్టీఆర్- దేవర (2024)

10. ప్రభాస్- కల్కి 2898 ఏడీ (2024)

11. తేజ సజ్జా- హనుమాన్ (2024)

12. అల్లు అర్జున్- పుష్ప-2(2024)

13. వెంకటేష్- సంక్రాంతికి వస్తున్నాం (2025)

14. పవన్ కళ్యాణ్- ఓజీ (2025)

మొత్తానికి పై జాబితాలో ప్రభాస్ యాక్ట్ చేసినవి ఆరు సినిమాలు ఉండగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించినవి మూడు చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ తొలిసారి ఓజీతో రూ.250 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టారు.