Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ పార్ట్ -2 కోసం 70 రోజులు ఇస్తున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఐఫీస్ట్ లాంటి వార్త. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న‌ ప్రతిష్టాత్మక చిత్రం `ఓజీ2` కి సంబంధించి సంచలన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

By:  Srikanth Kontham   |   26 Sept 2026 8:00 PM IST
ప‌వ‌ర్ స్టార్ పార్ట్ -2 కోసం 70 రోజులు ఇస్తున్నారా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఐఫీస్ట్ లాంటి వార్త. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న‌ ప్రతిష్టాత్మక చిత్రం `ఓజీ2` కి సంబంధించి సంచలన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏకంగా 70 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉన్న తరుణంలో సినిమా సీక్వెల్ కోసం పవర్ స్టార్ ఇన్ని రోజుల సమయం కేటాయించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభుత్వం నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాలతో నిమిషం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇంత‌టి కఠినమైన షెడ్యూల్ మధ్యలో కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ `ఓజీ` రెండో భాగం కోసం 70 రోజుల సమయాన్ని కేటాయించడానికి అంగీకరించడం ఆయనకు సినిమా పట్ల, అభిమానుల పట్ల ఉన్న అంకితభావాన్ని చాటి చెబుతోంది. రాజకీయ బాధ్యతలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమర్థవంతంగా టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తూ షూటింగ్‌ను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

`ఓజీ 2` స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుందని తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో, పవర్ స్టార్ మాస్ ఇమేజ్‌కు తగినట్లుగా పవర్ ఫుల్ పాయింట్‌తో రూపుదిద్దుకుంటున్న సినిమా ఫస్ట్ పార్ట్ పైనే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మొదటి భాగంలోనే కథలోని కొన్ని కీలక అంశాలను మాత్రమే చూపించారు. రెండో భాగంలో అసలైన గ్యాంగ్‌స్టర్ డ్రామాను, యాక్షన్ ఎపిసోడ్లను విశ్వరూపంగా ఆవిష్కరించేందుకు సుజీత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

కథాంశంపై ఉన్న బలమైన నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ పార్ట్-2 కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో యాక్షన్ సన్నివేశాలు, మేకింగ్ విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతున్నాయని ప్రచారం సాగుతోంది. 70 రోజుల డేట్లు లభిస్తే పార్ట్-2 షూటింగ్‌ను సుజీత్ వేగంగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలరని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన భారీ సెట్లలో ప్రధాన ఘట్టాలను చిత్రీకరించేందుకు ప్రొడక్షన్ టీమ్ ఏర్పాట్లు పూర్తి చేస్తోందని.. పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఆధారంగా షెడ్యూల్స్ డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.

మొత్తానికి రాజకీయాల్లో పవర్ ఫుల్ లీడర్‌గా దూసుకుపోతూనే వెండితెరపై తన మార్క్ మాస్ జాతరను కంటిన్యూ చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవ్వడం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.