నిర్మాతలు.. పవన్ ను వదలడం లేదుగా..
'OG' సక్సెస్ మీట్లో పవన్ స్వయంగా 'OG' ఫ్రాంచైజ్ ఉంటుందని ప్రకటించడంతో, సినిమాలకు గుడ్‌బై చెప్పే ఆలోచన లేదని అర్థమైంది.
By: M Prashanth | 9 Oct 2025 10:18 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, చాలామంది అనుకున్నట్టుగా సినిమాలు ఇక ఆగిపోతాయా లేదా కొత్త కమిట్‌మెంట్స్ ఉండవా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఫ్యాన్స్‌లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ టైంలో పవన్ వేరే ప్రాజెక్టులు ఎనౌన్స్ చేయకపోవడంతో ఈ రిటైర్మెంట్ బజ్ మరింత పెరిగింది. కానీ, ఇటీవల మూమెంట్ ప్రకారం.. పవన్ కళ్యాణ్ నుంచి సినిమా బ్రేక్స్ ఉండకపోవచ్చు అనే సమాచారం వినిపిస్తోంది.
'OG' సక్సెస్ మీట్లో పవన్ స్వయంగా 'OG' ఫ్రాంచైజ్ ఉంటుందని ప్రకటించడంతో, సినిమాలకు గుడ్‌బై చెప్పే ఆలోచన లేదని అర్థమైంది. అయితే, దర్శకుడు సుజీత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను నానితో చేయాల్సి ఉంది కాబట్టి, 'OG' సీక్వెల్ లేదా ప్రీక్వెల్‌కు కొంత టైమ్ పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌లో పవన్ వేరే చిత్రాలు చేస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ డిస్కషన్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేయాల్సిన ముఖ్యమైన ప్రాజెక్ట్లలో హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే పూర్తి చేసి, రిలీజ్ అప్‌డేట్‌ను ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా, పాత కమిట్‌మెంట్లు కూడా పవన్‌కు ఉన్నాయి.
అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రామ్ తాళ్లూరికి చెందిన ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో చేయాల్సిన సినిమా. రెండేళ్ల క్రితమే పవన్ కు అడ్వాన్స్ ఇచ్చిన ఈ నిర్మాతలు, డబ్బు వెనక్కి తీసుకోవాలని అస్సలు అనుకోవడం లేదట. ఎలాగైనా పవన్‌తో సినిమా చేయాలని పట్టుదలతో ఉన్నారు. దీని కోసం వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి ఇప్పటికే స్క్రిప్ట్‌లను సిద్ధం చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది.
మరోవైపు, దిల్ రాజు వంటి టాప్ ప్రొడ్యూసర్ కూడా పవన్‌తో మళ్లీ సినిమా చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. 'వకీల్ సాబ్' తర్వాత వీరి కాంబోలో సినిమా రావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌కు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారనే బజ్ బలంగా వినిపిస్తోంది. ఈ చర్చలు ఏ దశలో ఉన్నాయో, ఈ కాంబో సెట్ అవుతుందో లేదో తెలియాలంటే కొంత సమయం వేచి చూడాలి. ఏదేమైనా, నిర్మాతలు దర్శకులు పవన్ కళ్యాణ్‌ను అంత త్వరగా వదిలేలా లేరు. రాజకీయాలు, సినిమాలు రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తూ, పవర్ స్టార్ ఇకపై ఎలాంటి సినిమాలు చేస్తారు, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది చూడాలి.
