ఆ నిర్మాతతో పవన్ మూవీ పక్కానా? డైరెక్టర్ ఎవరు మరి?
తన బ్యానర్ ను మళ్లీ యాక్టివేట్ చేసి సినిమాలు తీస్తానని వెల్లడించారు. అదే సమయంలో ఇప్పుడు మరో విషయంపై చర్చ సాగుతోంది.
By: M Prashanth | 1 Aug 2025 6:48 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. జులై 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఓజీ మూవీతో సందడి చేయనున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన సినిమా విడుదలవుతుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని మరింత పెంచేందుకు మేకర్స్ కూడా రెడీ అవుతున్నారు. మరికొన్ని గంటల్లో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. అదే సమయంలో పవన్ లైనప్ లో ఉన్న మరో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. వచ్చే ఏడాది ఆ సినిమా థియేటర్స్ లోకి రానుంది.
దీంతో పవన్ ఇప్పటికే ఓకే చేసిన సినిమాలు వివరాలు అలా ఉంటే.. పవర్ స్టార్ మళ్లీ కొత్త సినిమాలు చేస్తారో లేదో క్లారిటీ లేదు. నిర్మాతగా మాత్రం మూవీలను రూపొందిస్తానని రీసెంట్ గా వీరమల్లు ప్రమోషన్స్ లో తెలిపారు. తన బ్యానర్ ను మళ్లీ యాక్టివేట్ చేసి సినిమాలు తీస్తానని వెల్లడించారు. అదే సమయంలో ఇప్పుడు మరో విషయంపై చర్చ సాగుతోంది.
అయితే వీరమల్లు మూవీ రిలీజ్ కావడానికి చివరి నిమిషంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని టాక్ వినిపించింది. అప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత నవీన్ ఎర్నేనితోపాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓనర్, ఎన్నారై వ్యాపారవేత్త టీజీ విశ్వప్రసాద్ రంగంలోకి దిగి.. సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ చేశారని వార్తలు వచ్చాయి.
అందుకు ప్రతిఫలంగా టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా పవన్ ఓ మూవీ చేస్తారని టాక్ ఇప్పటికే వినిపించింది. ఇప్పుడు అదే నిజమని తెలుస్తోంది. అయితే పవన్ బ్రో మూవీని విశ్వప్రసాదే నిర్మించారు. కొంతకాలంగా పవర్ స్టార్ తో సన్నిహిత బంధాన్ని కొనసాగిస్తున్నారు. జనసేన బ్యాక్ ఎండ్ కార్యకలాపాలలో కూడా యాక్టివ్ గా ఉన్నారని తెలుస్తోంది.
ఇప్పుడు పవన్ తో మరో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారట. అయితే ఉస్తాద్ కంప్లీట్ అయ్యాక.. ఏపీ రాజకీయాలపై మళ్లీ పవన్ దృష్టి పెట్టనున్నారు. ఆ తర్వాత విశ్వప్రసాద్ నిర్మాణంలో వర్క్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు గాను సరైన దర్శకుడి కోసం ఆయన వెతుకుతున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయని వినికిడి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
