పవన్ కళ్యాణ్ పౌరాణికం.. ఫ్యాన్స్ కి ట్రీట్..!
అసలే పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా పూజలు చేస్తున్నాడు.. హిందూ ధర్మంలో తనకు కుదిరినట్టుగా నడుచుకుంటున్నాడు.
By: Ramesh Boddu | 23 Nov 2025 2:00 PM ISTస్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో ఫ్యాన్స్ ని మెప్పించడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఆ రేసులో దూసుకెళ్తున్న వారు కొందరైతే నెక్స్ట్ రాబోతున్న సినిమాలతో ప్లాన్ చేసిన వారు మరికొందరు. ఈ క్రమంలోనే ఈమధ్య స్టార్ సినిమాల్లో పౌరాణిక, మైథాలజీ టచ్ ఎక్కువ కనిపిస్తుంది. సినిమాలో అలాంటి సీన్స్ ఉంటే ఆడియన్స్ కూడా సర్ ప్రైజ్ అవుతున్నారన్న కారణంతో అలాంటి కథలు, సినిమాలు చేస్తున్నారు. ఐతే తెలుగు హీరోల్లో ఇప్పుడున్న స్టార్స్ లో ఎన్టీఆర్ ఇలాంటివి చేయడంలో అదరగొట్టగా ప్రభాస్ కూడా ఆదిపురుష్, కల్కి 2898 ఏడితో అలాంటి టచ్ ఇచ్చాడు.
అర్జునుడిగా పవన్ కళ్యాణ్..
ఇక చరణ్ కూడా RRR లో అల్లూరి సీతారామరాజు లుక్ తో సర్ ప్రైజ్ చేశాడు. నెక్స్ట్ చరణ్ కూడా ఏదో ఒక మైథాలజీ కథతో వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. పౌరాణికం, మైథాలజీ కథల్లో పవన్ కళ్యాణ్ ని చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే రీసెంట్ గా ఆయన చేసిన హరి హర వీరమల్లు సినిమాలో అది కొద్దిమేర జరిగినా మైథాలజీ కథల్లో పవర్ స్టార్ ని చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
అసలే పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా పూజలు చేస్తున్నాడు.. హిందూ ధర్మంలో తనకు కుదిరినట్టుగా నడుచుకుంటున్నాడు. ఐతే పవన్ కళ్యాణ్ కూడా రామాయణ, మహాభారత పాత్రల్లో కనిపించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ అర్జునుడిగా నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అర్జునుడిగా పవన్ ఐతే కృష్ణుడు ఎవరు.. యుద్ధం చేసేది ఎవరి మీద అంటూ నెటిజెన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
వారణాసి సినిమాలో రాముడిగా మహేష్..
మొత్తానికి పవన్ ని కూడా మహాభారత పాత్రల్లో చూడాలని ఫ్యాన్స్ కోరిక బలంగా వినిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ కూడా రాజమౌళి చేస్తున్న వారణాసి సినిమాలో రాముడిగా కనిపిస్తాడని తెలుస్తుంది. సో ఇన్నాళ్లు పౌరాణికానికి దూరంగా ఉన్న మహేష్ కూడా వారణాసితో షురూ చేస్తున్నాడు కాబట్టి ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ ఒక్కడే అనుకుంటున్నారు ఫ్యాన్స్. మరి పవన్ ని ఆ పాత్రలు చేసేలా స్పూర్తి ఇచ్చే కథను ఎవరు తీసుకొస్తారు. ఆ సినిమాలు ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది చూడాలి.
పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ సినిమాతో ఫ్యాన్స్ ని అలరించారు. నెక్స్ట్ ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు. ఐతే సురేందర్ రెడ్డితో పవర్ స్టార్ సినిమా ఒకటి చేస్తాడని అనౌన్స్ మెంట్ వచ్చింది. ఆ సినిమా ఉంటుందో లేదో మాత్రం క్లారిటీ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఏంటనది తెలియాల్సి ఉంది.
