ఉస్తాద్ ఫైర్: మెడ ముట్టుకుంటే.. తొడ కొట్టినట్టే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` సెన్సేషన్ మొదలైంది.
By: Sivaji Kontham | 22 Feb 2026 8:25 PM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` సెన్సేషన్ మొదలైంది. ఈరోజు విడుదలైన `ఆరా ఆఫ్ ఉస్తాద్` సాంగ్ లిరిక్స్ .. పవన్ కల్యాణ్ స్వాగ్ అభిమానులను ఊపిరి సలపనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. ఎక్కడ చూసినా ఉస్తాద్ హంగామానే. ఎటు చూసినా ఉస్తాద్ జోష్ కనిపిస్తోంది. యూత్, స్టూడెంట్స్ ఉర్రూతలూగుతున్నారు.
`ఆరా ఆఫ్ ఉస్తాద్` పాట లాంచ్ వేడుక ఈరోజు (22ఫిబ్రవరి, ఆదివారం) హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో అత్యంత ఘనంగా జరుగుతోంది. సాయంత్రం 4 గంటల నుంచే విద్యార్థులు, అభిమానుల కోలాహలంతో ఆ ప్రాంతం మార్మోగిపోతోంది. ఈ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ సిగ్నేచర్ మ్యానరిజం..మెడ మీద చెయ్యి వేయడం వెనుక ఉన్న అసలు కథను కూడా రివీల్ చేసారు.
ముఖ్యంగా ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటలోని `మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే!` అంటూ వినిపిస్తున్న పవర్ పంచ్ డైలాగ్ కి యూత్ గగ్గోలు పెడుతోంది. మల్లారెడ్డి వర్శిటీలో వేలాదిగా విద్యార్థుల నడుమ జరుగుతున్న ఈవెంట్ లో కోలాహాలాన్ని పెంచడంలో ఈ పాట విఫలం కాలేదు. ఈ పాటకు యూత్ జోష్ తో ఊగిపోతున్నారు. పవర్ స్టార్ మానియా మరోసారి అహూతులను ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా మల్లారెడ్డి కాలేజ్ మహిళా విద్యార్థులు పవర్ స్టార్ సిగ్నేచర్ మార్క్ ఎర్ర కండువాలు చేత్తో పట్టుకుని గాల్లో గిరగిరా తిప్పుతూ ఆయనను అనుకరించడం మరో స్పెషల్ అప్పియరెన్స్.
షూటింగ్ ఎంతవరకు వచ్చింది?
ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. క్లైమాక్స్ చిత్రీకరణ గత సెప్టెంబర్‌లోనే ముగిసింది. ప్రస్తుతం సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జనవరి నుంచే డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. హీరోయిన్ రాశీ ఖన్నా కూడా తన పార్ట్ డబ్బింగ్‌ను ఫిబ్రవరిలో పూర్తి చేశారు.
రిలీజ్ డేట్ ఎప్పుడు?
మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సమ్మర్ కానుకగా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద `గబ్బర్ సింగ్` సహా `ఓజీ` రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ నటుడు ఆర్. పార్తీబన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డిఎస్పీ) సంగీతం అందిస్తున్నారు. ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటను ఆస్కార్ విజేత చంద్రబోస్ రచించారు.
నేను మెడ ముట్టుకుంటే.. తొడ కొట్టినట్టే! అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. పవన్ మానియా మళ్ళీ పీక్స్‌కి చేరిందని చెప్పవచ్చు.
