34 ఏళ్ల తర్వాత గురువుతో పవర్ స్టార్
ఇక లేటెస్ట్ గా మార్షల్ ఆర్ట్స్ ప్యాషన్‌కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు, అభిమానులు కూడా పవన్ ఎనర్జీని చూస్తూ ఫిదా అవుతున్నారు.
By: M Prashanth | 29 July 2025 4:46 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తన మల్టీ టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకుంటుంటారు. రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా మళ్ళీ OG, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా మార్షల్ ఆర్ట్స్ ప్యాషన్‌కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు, అభిమానులు కూడా పవన్ ఎనర్జీని చూస్తూ ఫిదా అవుతున్నారు.
బిజీగా ఉన్నా ప్యాషన్ మాత్రం మర్చిపోలేదు
పవన్ కళ్యాణ్ ఇప్పటికీ సినిమా షూటింగ్స్, డిప్యూటీ సీఎంగా సమావేశాలు, ప్రెస్ మీట్స్, ప్రమోషన్స్ ఇలా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా బిజీగా ఉంటున్నారు. అయినా తన అసలు ప్యాషన్ అయిన మార్షల్ ఆర్ట్స్‌ని మాత్రం మర్చిపోలేదు. చిన్నప్పటి నుంచి కరాటే, కుంగ్‌ఫు వంటి కళల్లో పవన్‌కు ఆసక్తి ఎక్కువ. ఆయన కొన్ని మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా. క్రీడలంటే ఎంత మక్కువ ఉందో గతంలోనూ చాలాసార్లు చూపించారు.
34 ఏళ్ల తర్వాత సీనియర్‌తో రీయూనియన్
ఇటీవల పవన్ కళ్యాణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 34 ఏళ్ల తర్వాత తన సీనియర్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ అయిన తిరు రెన్షి రాజా అవ్ల్‌తో మళ్లీ కలిసిన విషయాన్ని పంచుకున్నారు. 1990లలో శిహాన్ హుస్సైనీ అవ్ల్ గైడెన్స్‌లో ఇద్దరూ కలిసి చెన్నైలోని ఒకే కరాటే స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. అప్పట్లో రాజా ఇప్పటికే బ్లాక్ బెల్ట్ సాధించగా, పవన్ కళ్యాణ్ గ్రీన్ బెల్ట్ స్టేజ్‌లో ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ రాజా ఆ స్కూల్‌కు లీడర్‌గా మారి, శిహాన్ హుస్సైనీ కలను నిజం చేయడంలో పూర్తిగా డెడికేషన్‌తో ముందుకు వెళ్లడాన్ని చూసి గర్వంగా ఉందని పవన్ చెప్పారు. ఇద్దరి కలయికను గుర్తుచేసుకుంటూ మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న ప్యాషన్, అవారెనెస్‌ను ఆయన వివరించారు.
మార్షల్ ఆర్ట్స్‌పై ఎనలేని ప్రేమ
పవన్ కళ్యాణ్‌ను పరిచయం చేయడానికి 'యాక్టర్' అనే పదం మాత్రమే సరిపోదు. ఆయనకి స్పిరిట్వల్ పర్సనాలిటీతో పాటు మార్షల్ ఆర్ట్స్ మీద ఎనలేని ప్రేమ ఉంది. ఈ మధ్య కాలంలోనూ, యూత్‌కు ఫిట్‌నెస్, సెల్ఫ్ డిఫెన్స్‌పై పవన్ ఇచ్చే మోటివేషన్ మెస్సేజ్‌లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మార్షల్ ఆర్ట్స్‌లో కేవలం ఫిజికల్ ఫిట్‌నెస్ మాత్రమే కాదు, మానసిక స్థిరత్వం, క్రమశిక్షణ కూడా ముఖ్యమని ఆయన అనేక సార్లు చెప్పారు.
ఈ కరాటే ట్రైనింగ్ ఫొటోలు చూస్తుంటే.. అభిమానులు పవన్ కళ్యాణ్‌లోని డెడికేషన్, వరల్డ్ క్లాస్ ఆర్టిస్టు వైపు మరింత ఆకర్షితులవుతున్నారు. మరొకవైపు, పవన్ తన సీనియర్ రెన్షి రాజా అవ్ల్‌తో గతంలోని అనుభూతులను గుర్తు చేసుకోవడమే కాకుండా, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న వారసత్వాన్ని ప్రొమోట్ చేయడంలో ముందుండడం అందరికి ఇన్‌స్పిరేషన్‌గా మారింది.
సినిమాలు, రాజకీయాలు
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు రాజకీయాలలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. వీరమల్లు సినిమా ఇటీవల గ్రాండ్ గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద జెట్ స్పీడ్ లో 100కోట్లు రాబట్టింది. ఇక నెక్స్ట్ OG రానుంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
