Begin typing your search above and press return to search.

రెండున్న‌ర గంట‌ల్లో 2 గంటలు పవ‌న్‌నే చూస్తారు: హ‌రీష్ శంక‌ర్

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్‌లో ఈరోజు (ఫిబ్రవరి 22) సాయంత్రం జరిగిన `ఆరా ఆఫ్ ఉస్తాద్` సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ ప్రసంగం అభిమానుల్లో పూనకాలు తెప్పించింది.

By:  Sivaji Kontham   |   22 Feb 2026 8:25 PM IST
రెండున్న‌ర గంట‌ల్లో 2 గంటలు పవ‌న్‌నే చూస్తారు: హ‌రీష్ శంక‌ర్
X

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్‌లో ఈరోజు (ఫిబ్రవరి 22) సాయంత్రం జరిగిన `ఆరా ఆఫ్ ఉస్తాద్` సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ ప్రసంగం అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. ఆయన స్పీచ్‌లోని ఎగ్జ‌యిట్ చేసే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే..

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ గారి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ ఉన్నాయని అన్నారు. ఆయన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, ఆయన సెన్సాఫ్ హ్యూమర్, సజహంగా ఉండే ఎనర్జీ.. ఇలా ప్రతిదీ ఈ సినిమాలో చూడబోతున్నారు. సాధారణంగా సినిమాల్లో హీరో ఎంత‌సేపు కనిపిస్తారు. కానీ ఈ రెండున్నర గంటల సినిమాలో దాదాపు 2 గంటల పాటు పవన్ కల్యాణ్ గారే స్క్రీన్ మీద ఉంటారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ నవ్వు.. ప్రతి ఫ్యాన్‌కి నచ్చేలా డిజైన్ చేశాను.

కలెక్షన్లు, సక్సెస్ అనేది దైవాధీనం.. దాని గురించి నేను మాట్లాడను. కానీ, సినిమాకి వచ్చిన ప్రతి పవన్ కల్యాణ్ అభిమాని మా అన్న‌ను ఇలా చూడాలనుకున్నాం! అని గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఆయన ఈ సినిమా కోసం కోట్లు వదులుకుని టైమ్ ఇచ్చారు.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను! అని అన్నారు.

ఈవెంట్ మరిన్ని విశేషాలు:

ఈరోజు సాయంత్రం విద్యార్థుల‌కు పండ‌గే పండ‌గ‌! ఈవెంట్ జరిగిన మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణం పవర్ స్టార్ నినాదాలతో మార్మోగిపోయింది. వేలాదిగా విద్యార్థులు, అభిమానులు తరలివచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సెకండ్ సింగిల్ `ఆరా ఆఫ్ ఉస్తాద్` ప్రోమోలో పవన్ కల్యాణ్ ఒక మార్కెట్ యార్డులో సన్ గ్లాసెస్ పెట్టుకుని.. భుజాన గన్ వేసుకుని టీ గ్లాసుతో నడిచివచ్చే షాట్స్ కేక పుట్టిస్తున్నాయి. ఈ వేడుకలో నిర్మాత నవీన్ యెర్నేని, రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్), మల్లారెడ్డి ఇత‌ర‌ చిత్ర బృందం పాల్గొన్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న భారీ ఎత్తున విడుదల కానుంది. సమ్మర్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి ఉస్తాద్ సిద్ధంగా ఉన్నాడనే సంకేతాలు బ‌లంగా ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరీష్ శంకర్ చెప్పినట్లుగా 2 గంటల పాటు పవన్ కల్యాణ్ స్క్రీన్ మీద ఉంటే.. థియేటర్లలో రచ్చ ఎలా ఉంటుందో ఊహించ‌వ‌చ్చు.