పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?
పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలనే ప్రయత్నాలను నిర్మాత రామ్ తాళ్లూరి కొనసాగిస్తున్నారు. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రాజెక్ట్ ప్రకటించినా ఇంకా పట్టాలెక్కలేదు. తాజాగా కొత్త దర్శకుడితో, పరిమిత బడ్జెట్‌లో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడు మారుతున్నారా, కొత్త కథ సిద్ధమైందా అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.
By: M Prashanth | 20 Nov 2026 12:00 AM ISTపవన్ కల్యాణ్‌తో సినిమా కోసం నిర్మాత రామ్ తాళ్లూరి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఇప్పుడు కొత్త దర్శకుడితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి భారీ బడ్జెట్ జోలికి వెళ్లకుండా, వీలైనంత తక్కువ ఖర్చుతో సినిమా పూర్తి చేయాలనే ప్లాన్ ఏమైనా ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే పవన్ గత సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు చూస్తే నిర్మాతలు రిస్క్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు.
గతేడాది వచ్చిన 'హరిహర వీరమల్లు' భారీ నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత 'ఓజీ' పవన్ కెరీర్‌లోనే రికార్డు ఓపెనింగ్స్ అందుకుంది. కానీ భారీ ధరలకు హక్కులు కొనుగోలు చేసిన కొందరు బయ్యర్లకు ఆశించిన లాభాలు రాలేదు. ఇక ఈ ఏడాది విడుదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా బాక్సాఫీస్ వద్ద దెబ్బతింది. పవన్ క్రేజ్‌తో మొదటి రోజు వసూళ్లు తెచ్చుకోవచ్చు కానీ, కంటెంట్ యావరేజ్‌గా ఉన్నా భారీ బడ్జెట్ రికవరీ చేయడం కష్టమవుతోంది.
ఈ పరిస్థితుల్లో రామ్ తాళ్లూరి పెద్ద దర్శకుడితో భారీ సినిమా చేయడం కంటే కొత్త దర్శకుడితో కంటెంట్ ఉన్న కథను ఎంచుకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారనే టాక్ కూడా వస్తోంది. సురేందర్ రెడ్డి లాంటి దర్శకుడితో సినిమా చేస్తే బడ్జెట్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. అదే డెబ్యూ డైరెక్టర్‌తో పరిమిత లొకేషన్లు, తక్కువ షూటింగ్ డేస్‌తో సినిమా పూర్తి చేస్తే నిర్మాణ ఖర్చులో కొంత తగ్గించుకోవచ్చు. అయితే కొత్త దర్శకుడి పేరు ఎందుకు వినిపిస్తోందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
పైగా పవన్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఎక్కువ రోజులు షూటింగ్ కోసం కేటాయించడం కూడా అంత ఈజీ కాదు. ఆయన డేట్స్‌కు తగ్గట్టుగా పక్కా స్క్రిప్ట్, షెడ్యూల్స్ సిద్ధం చేసుకుంటే నిర్మాతకు సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. పవన్ రెమ్యునరేషన్ పెద్ద మొత్తంలోనే ఉండే అవకాశం ఉన్నప్పటికీ మిగతా ఖర్చులను కంట్రోల్ చేయగలిగితే బిజినెస్‌లో కొంత వెసులుబాటు దొరుకుతుంది.
పవన్ కూడా అభిమానులకు నచ్చే ఎంటర్‌టైన్ మెంట్‌తో పాటు బలమైన కథ ఉన్న సినిమాను కంట్రోల్డ్ బడ్జెట్‌లో చేస్తే నిర్మాతకు రికవరీ భారం తగ్గుతుంది. థియేట్రికల్‌తో పాటు ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా కూడా పెట్టుబడిలో కొంత మొత్తం వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు రామ్ తాళ్లూరి మాత్రం పవన్‌తో సినిమా చేయాలనే ప్రయత్నాన్ని వదిలిపెట్టడం లేదు.
2021లోనే సురేందర్ రెడ్డి కాంబినేషన్ ప్రకటించగా, ఈ ఏడాది జనవరిలో మరోసారి అదే ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే దర్శకుడు మారుతున్నారా, కొత్త కథ సిద్ధమైందా అనే వివరాలు బయటకు రాలేదు. పవన్‌తో ఇప్పటివరకు చేసుకున్న కమిట్‌మెంట్‌ను సినిమాగా మార్చుకోవడమే రామ్ తాళ్లూరి టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి అసలు అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
