Begin typing your search above and press return to search.

పవన్ స్పీడ్‌కు తగ్గ డైరెక్టర్స్.. ఈ కోలీవుడ్ కాంబో సెట్టయితే అరాచకమే..

అందుకే, ఆయన ఇప్పుడు జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేయగల సత్తా ఉన్న దర్శకుల వైపు చూస్తున్నారు.

By:  M Prashanth   |   17 Oct 2025 9:55 PM IST
పవన్ స్పీడ్‌కు తగ్గ డైరెక్టర్స్.. ఈ కోలీవుడ్ కాంబో సెట్టయితే అరాచకమే..
X

పాలిటిక్స్, సినిమాలు.. ఈ రెండింటినీ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తన సినిమా కమిట్‌మెంట్లను కూడా పూర్తి చేస్తున్నారు. ఇటీవల ‘OG’తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అలాగే మరికొన్నీ కథలపై చర్చలు జరుపుతున్నట్లు టాక్ వస్తోంది.

ఇక కన్నడ ఇండస్ట్రీకి చెందిన లేటెస్ట్ ట్రెండింగ్ KVN ప్రొడక్షన్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలపై ఫోకస్ పెంచింది. ప్రస్తుతం యశ్ తో టాక్సిక్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక లైనప్ లో పవన్ తో కూడా చర్చలు మొదలైనట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సమయం చాలా విలువైంది. రాజకీయ బాధ్యతల నడుమ, సినిమాలకు పరిమిత సమయాన్ని మాత్రమే కేటాయించగలరు.

అందుకే, ఆయన ఇప్పుడు జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేయగల సత్తా ఉన్న దర్శకుల వైపు చూస్తున్నారు. అనవసరమైన ఆలస్యం లేకుండా, పక్కా ప్లానింగ్తో అనుకున్న టైమ్‌కి సినిమాను ఫినిష్ చేసే టెక్నీషియన్లకు ఫస్ట్ ఛాయిస్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో, KVN తో చేయబోయే ప్రాజెక్ట్ కోసం ఇద్దరు టాప్ తమిళ దర్శకుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఆ లిస్ట్‌లో ఫస్ట్ వినిపిస్తున్న పేరు, ఇండియన్ సినిమాను షేక్ చేస్తున్న లోకేష్ కనగరాజ్.

LCUతో తనకంటూ ఒక యూనివర్స్‌ను క్రియేట్ చేసుకున్న లోకేష్, తన రా, రస్టిక్ యాక్షన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఫేమస్. పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో, లోకేష్ లాంటి ఇంటెన్స్ డైరెక్టర్‌తో కలిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలొస్తున్నాయి. ఇది ఒక డ్రీమ్ కాంబినేషన్ అని, ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఇక రేసులో ఉన్న రెండో పేరు హెచ్. వినోత్. అజిత్ లాంటి స్టార్ హీరోతో 'వాలిమై', 'తునివు' వంటి హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలను చాలా వేగంగా తెరకెక్కించిన ట్రాక్ రికార్డ్ వినోత్‌కు ఉంది. అతని ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ చాలా షార్ప్‌గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ స్పీడ్‌కు, ప్రస్తుత అవసరాలకు వినోత్ స్టైల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆయన కూడా పవన్‌ను ఒక స్టైలిష్ యాక్షన్ హీరోగా చూపించగల సమర్థుడు.

ఇక ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్న KVN ప్రొడక్షన్స్, భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పవన్ కళ్యాణ్ తో న్యూ కాంబినేషన్‌కు కావాల్సిన స్కేల్‌ను, నిర్మాణ విలువలను అందించగల సత్తా ఈ సంస్థకు ఉంది. ఈ కాంబో ఒక సరికొత్త పాన్ సౌత్ ఇండియన్ సినిమాకు బెంచ్‌మార్క్‌ను సెట్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద, ఈ వార్త పవన్ ఫ్యాన్స్‌లో అయితే మాంచి జోష్ నింపింది. మరి ఈ కాంబో నిజంగా సెట్టవుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.